English | Telugu

బిగ్ బాస్ ఓటీటీ-2లోకి భోలే షావలి!


బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిందో లేదో ఓటీటీతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిగ్ బాస్ సీజన్ -8 కి ఇంకా చాలానే టైమ్ ఉండడంతో ఓటీటీతో సరిపెడుతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఓవైపు ఓటీటీలో చాలా వరకు ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకుటున్నట్లు బయట టాక్ నడుస్తుంటే.. మరోవైపు ఓటీటీ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సీజన్ కి సంబంధించి చాలా వరకు యూట్యూబర్స్, ఇన్ ఫ్లూ యెన్సర్,లు యాక్టర్స్ ని తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బిబి టీమ్ కొంతమందిని అప్రోచ్ అయిందట. అన్ని కుదిరితే మార్చ్ లాస్ట్ వీక్ లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సీజన్ 7 కంటెస్టెంట్ అయిన భోలే షావలి అందరికి సుపరిచితమే. వైల్డ్ కార్డ్ ద్వారా పాటబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన స్పాంటేనీయస్ పాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. హౌస్ లోకి చాలా మంది ఎంట్రీ ఇస్తుంటారు కానీ ప్రేక్షకులకి మాత్రం బాగా కనెక్ట్ అయిన వారు కొందరే ఉంటారు.

అందులో ఈ సీజన్ కి భోలే షావాలి ముందు వరుసలో ఉంటాడు. హౌస్ లో నేను న్యాయనికి సపోర్ట్ ఇస్తానంటు ఎలాంటి ఫౌల్స్ ఆడకుండ ఉన్నాడు భోలే. హౌస్ లోని కొంతమంది హౌస్ మేట్స్ కి భోలే ప్రవర్తన నచ్చక తరచు గోడవలకి దిగేవారు. హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సీరియల్ బ్యాచ్ కి భోలే సంచులకొద్దీ పంచులు వేస్తూ వారిని తికమక పెట్టాడు. ఇక భోలే హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ప్రేక్షకులు తీవ్రంగా విమర్శలు కురిపించారు. అయితే భోలే బయటకు వచ్చాక తన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. భోలే షావలి మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. తను సొంత డైరెక్షన్ లో శుభశ్రీతో కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చెయ్యగ అది మంచి హిట్ అయింది.

భోలే ఈ ఓటీటీ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం వైరల్ అవ్వగా.. బిగ్ బాస్ టీమ్ కూడా అప్రోచ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది తెలిసిన భోలే ఫ్యాన్స్.. ఇక ఓటీటీలో ఎంటర్‌టైన్మెంట్ కి కొదవ లేదు అనుకుంటున్నారు. భోలే ఉంటేనే హౌస్ లో ఎంటర్‌టైన్మెంట్ అనేంతగా సీజన్ సెవెన్ సాగింది. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణలని ఓ ఆట ఆడుకున్న భోలే షావలి గనుక ఓటీటీ సీజన్ లో అడుగుపెడితే రచ్చ రంబోలే అంటున్నారు నెటిజన్లు. కాగా ఇప్పుడు ఈ వార్త నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.