English | Telugu

నా లిప్ బామ్ సీక్రెట్ ఇదే...అకీరాతోనే మూవీ చేస్తాను

అడివి శేష్ అంటే చాలు దేశభక్తి ఉట్టిపడే మూవీస్, రొమాంటిక్ సీన్స్ గుర్తొస్తాయి. అలాంటి శేష్ వాడే లిప్ బామ్ ఏమిటి ? అనే ఇంటరెస్టింగ్ న్యూస్ ని ఉస్తాద్ అనే షోలో రివీల్ చేశారు. ఈవారం ఉస్తాద్ షోకి అడివి శేష్ ఎంట్రీ ఇచ్చారు. "నువ్వు లిప్స్ బాగా మెయింటైన్ చేస్తున్నావ్ బ్రో..నీ లిప్స్ కి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడతావో చెప్పు" అని ఉస్తాద్ షో హోస్ట్ మంచు మనోజ్ అడిగేసరికి "లిప్ బామ్" అని ఆన్సర్ ఇచ్చాడు శేష్.."ఐతే ఆ లిప్ బామ్ ఎవరిదో చూపించండి ఒకసారి" అని మనోజ్ అడిగేసరికి శేష్ నటించిన మూవీస్ లోని అన్ని లిప్ కిస్ సీన్స్ ని స్క్రీన్ మీద ప్లే చేసి చూపించారు.

దాంతో శేష్ చాలా సిగ్గుపడిపోయాడు. "చాలా లిప్ బామ్స్ వాడావు భయ్యా..మార్కెట్ లో ఉన్న అన్ని లిప్ బామ్స్ ని వాడినట్టున్నాడు " అని కౌంటర్ వేసాడు మనోజ్. "నీకిష్టమైన లిప్ బామ్ ఏమిటి" అని మనోజ్ మళ్ళీ అడిగేసరికి "అర్జెంట్ గా అమ్మకి ఫోన్ చేసి ఈ షో చూడొద్దు అని చెప్పాలి" అన్నాడు శేష్. మరీ "రహస్య రసికుడు టైపులో పోట్రె" చేస్తున్నారు అని కామెడీగా ఫీలయ్యాడు. తర్వాత మనోజ్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.."నటుడిని కాకపోయి ఉంటే జర్నలిస్ట్ ని అయ్యేవాడిని. రాప్ సాంగ్స్ పాడటం నా హాబీ. గూఢచారి మూవీకి ఒక రాప్ సాంగ్ రాసాను. కానీ మా డైరెక్టర్ రిజెక్ట్ చేశారు. అకీరా నందన్ నాకు గుండెకాయ లెక్క. నా మూవీలో ఒక సాంగ్ ని పియానో మీద చేసి పంపించాడు..అసలు మాములుగా లేదు. తన మ్యూజిక్ సెన్స్ అద్భుతం. నేనే 6 ' 2 ఉంటాను అకిరా 6 ' 4 హైట్ ఉంటాడు. నేనే తలెత్తుకుని చూడాల్సి వస్తుంది. నేను ఒక స్టోరీ రాసాను అది పవన్ కళ్యాణ్ కి అకీరాకి నచ్చింది అనుకుంటే నేను అకీరాతో మూవీ చేయడానికి ఇష్టపడతాను. పవన్ కళ్యాణ్ అంటే గౌరవం అంతే" అని చెప్పాడు శేష్.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..