English | Telugu

దుబాయ్ లో జరిగింది లీక్ చేసిన ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్!

ఆర్జే చైతు.. విజయవాడలో పుట్టి పెరిగాడు. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీద పడ్డాయి. చైతు చిన్నప్పుడు తల్లి చేసే వ్యాపారంలో చిన్న చిన్న సాయాలు చేస్తూ ఉండేవాడంట. అలా కష్టపడడం ఎలా ? ఏమిటి? అని నేర్చుకున్నాడంట. రేడియోలో మాట్లాడే వారి మాటలు విని విని తను కూడా రేడియోలో మాట్లాడాలని అనుకున్నాడంట చైతు. అయితే రేడియోలో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించిన చైతుకి ఎట్టకేలకు రేడియో జాకీగా జాబ్ వచ్చింది. అలా తన కెరీర్‌ లో చైతు పడిన కష్టాలను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేముందు జర్నీ వీడియోలో చెప్పుకొచ్చాడు.

చైతు తన స్నేహితుల సహాయంతో రేడియో జాకీగా ఉద్యోగం తెచ్చుకున్నాడంట. అదే సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడటంతో పాటు కొన్ని రోజులకే ఆ ప్రేమ విఫలమైందని ఇక ఆ ప్రేమ విఫలమై విషాదంలో కూరుకుపోతున్న తనకు ఎట్టకేలకు జీవితం అంటే ఏమిటనే విషయం తెలిసి వచ్చిందని చెప్పాడు. పార్ట్ టైమ్ రేడియో జాకీగా మొదలుపెట్టిన తను తర్వాత ఫుల్ టైమ్ రేడియో జాకీగా మారాడంట. ఆ తర్వాత చైతు హైదరాబాద్ లో కష్టపడుతున్నాడని భావించిన తన తల్లి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఫుడ్ వ్యాపారం మొదలు పెట్టిందంట‌‌. తనకు వాళ్ళ అమ్మ అండగా నిలబడిందని, ఆమెకు ఇల్లు కట్టి ఇవ్వడం తన కల అని చైతు చెప్పుకొచ్చాడు. ఇక స్టేజి మీదకు వచ్చిన తర్వాత నాగార్జున. ఆయనకు ఒక సర్ ప్రైజ్ ఇస్తున్నానని చెబుతు ఆయన తల్లిని స్టేజి మీదకు తీసుకువచ్చారు. ఆమె వచ్చి రావడంతో తన కుమారుడిని ఆప్యాయంగా హత్తుకుంది. హౌస్ లోకి వెళ్లబోయే ముందు ఆమె తీసుకువచ్చిన తినుబండారాలు కూడా తింటు తను ఎలా అయిన హౌస్ లో కప్ గెలుస్తానని ధైర్యంతో లోపలికి వెళ్ళాడు చైతు. ఆ తర్వాత హౌస్ లో అరియానా, తేజస్వినిలతో గొడవలు పడి బయటకు వచ్చేశాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆర్జే చైతుకి ఫుల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది‌.‌ ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇమ్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్, ఫోటోలతో ఫుల్ బిజీగా ఉండే చైతూ.. తాజాగా ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేశాడు. మీ ట్రిప్ ఎలా ఉందని ఒకరు అడుగగా.. వీళ్ళు బస్సులోనే సైలెంట్ గా ఉంటారని తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ని చూపించి చెప్పాడు చైతు. చాలా సన్నగా అయ్యారని ఒకరు అడుగగా.. కావలసినంత తింటున్నా హెల్తీ కూడా అని చైతు రిప్లై ఇచ్చాడు. దుబాయ్ వీడియోలలో ఏం అయిన ఇంట్రస్ట్ గా ఉంటే మాకు లీక్ చేయండి అని అనగా.. అరియానా వాక్ చేస్తున్నప్పుడు తన హీల్స్ ఒక దగ్గర స్టక్ అయిపోతాయి. అది ఒక బ్లూపర్ కాబట్టి దానిని షేర్ చేసి అరియానాకి ట్యాగ్ చేశాడు‌ చైతు. ఇంక వాళ్ళ ఆఫీస్ కోలీక్స్ తో కలిసి వారి మధ్య ఉన్న బాండింగ్ అండ్ అర్థం చేసుకునే కొన్నింటిని షేర్ చేశాడు చైతు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.