English | Telugu

Brahmamudi:కొత్త కోడలి చిచ్చు మొదలైంది.. ఇక వారి ఆటకట్టివ్వనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -309 లో.. అనామిక చేసిన రచ్చ వల్ల అందరు కావ్యని తప్పుపడుతారు. ఈ అక్కచెల్లల్లు మోసం చేసి ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు. నా కోడలు అలా కాదు పెద్దల అంగీకారంతో ఈ ఇంటికి కోడలు అయిందని కావ్యని ధాన్యలక్ష్మి తక్కువ చేసి మాట్లాడుతుంటే.. అరేయ్ కళ్యాణ్ ఎక్కడ గొడవ ఎటు వెళ్తుంది. నువ్వు అనామికని తీసుకొని వెళ్ళని రాజ్ అంటాడు.

ఆ తర్వాత ఏంటి రా.. కొన్ని రోజులు స్వప్న వల్ల, కొన్ని రోజులు కావ్య వల్ల ఇంకా ఎన్ని రోజులు అప్పు వల్ల ఈ ఇంట్లో గొడవ ముందు నీ భార్యకి చెప్పని అపర్ణ అనగానే.. కావ్య ఏడుస్తు వెళ్ళిపోతుంది. కాసేపటికి కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. రాజ్ కావ్య బాధని పోగొట్టేలా మాట్లాడుతాడు. దాంతో రాజ్ భుజంపై కావ్య తలవాల్చి ప్రేమగా మాట్లాడుతుంది. మరుసటి రోజు అనామిక తన పేరెంట్స్ కి ఫోన్ చేసి మన ప్లాన్ ప్రకారం శోభనం చెడగొట్టుకున్నాను. అది కావ్య వల్లే జరిగిందని అనుకునేలా చేశాను. ఇప్పుడు వెళ్లి అందరి ముందు తనకి సారీ చెప్తే.. నాపై అందరికి మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇక అందరూ నావైపు ఉంటారని తన పేరెంట్స్ కి అనామిక చెప్తుంది. కాసేపటికి అందరు హాల్లోనే ఉండడం చూసిన అనామిక కావ్య దగ్గరకి వచ్చి గదిలో ఉంచాలిసిన విషయం అందరి ముందు పెట్టి అందరు నిన్ను మాటలు అనడానికి కారణం అయ్యను సారీ అని అనామిక చెప్తుంది. దాంతో కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు సారీ చెప్పిన క్షమించే గొప్ప మనసు అక్కడ ఎవరికీ లేదని కావ్యపై ధాన్యలక్ష్మి కోపంగా అంటుంది. ఇప్పటికి ఈ ఇంటికి కరెక్ట్ కోడలు దొరికింది అని అనామికని ఉద్దేశించి అపర్ణ అనగానే.. అంటే మీరు కాదా అని స్వప్న అనగానే.. ఏం మాట్లాడుతున్నావంటు అపర్ణ కోప్పడుతుంది. మరి మీరు అనామికని పొగడండి కానీ మమ్మల్ని తక్కువ చెయ్యకండని స్వప్న అంటుంది. ఇక నుండి కళ్యాణ్ అనామిక మీ గురించి మీరే మాట్లడుకోండి.. మా గురించి మాట్లాడుకోకండి అనామికకి సంబంధించిన దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వనని కావ్య చెప్పేసి వెళ్తుంది. అనామిక మాత్రం మనసు లో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరి ముందు మార్కులు కొట్టేసా ఇక కావ్య మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా చేశానని అనుకుంటుంది.

ఆ తర్వాత అప్పు కాలుకి దెబ్బ ఉన్నా నడవడనికి ట్రై చేస్తుంటుంది. కనకం పట్టుకోబోతుంటే ఎవరి సాయం లేకుండా నడవనివ్వమని కృష్ణమూర్తి అంటాడు. తరువాయి భాగంలో రాత్రి కంపెనీ నుండి ఎంప్లాయ్ ఫోన్ చేస్తుంది. సర్ ఉన్నారా అని అడిగితే ఫోన్ కట్ చేస్తున్నాడు . మార్నింగ్ వరకు డిజైన్స్ కావాలని పైవాళ్ళు అన్నారని అనగానే.. రాజ్ సర్ ఆఫీస్ కే వచ్చాడు. నువ్వు డిజైన్స్ పంపించు నేను వేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తుంటే.. ఎవరో రాజ్ శ్వేతతో మాట్లాడుతున్నది వీడియో తీసి కావ్యకి పంపిస్తారు. అది చూసిన కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.