English | Telugu

అడవిపులితో ఆడపులి బ్రేక్ ఫాస్ట్!



అడవిలోని పులులని దగ్గరి నుండి చూడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ ఆడపిల్ల అడవిపులి దగ్గర కూర్చొని టిఫిన్ చేసిందంటే వామ్మో తల్చుకుంటేనే భయమేస్తుంది కదా.. జోర్దార్ సుజాత అడవిపులి దగ్గరికెళ్ళి అక్కడ దానితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిందంటూ రాకింగ్ రాకేశ్ తన యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా అప్లోడ్ చేసిన వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు.

రాకింగ్ రాజేష్ ప్రస్తుతం జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేస్తుండగా.. తన టీమ్ లోనే జోర్దార్ సుజాత కూడా చేస్తోంది. జోర్దార్‌ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలో తెలంగాణ యాస‌లో ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది. అలా తీన్మార్ వార్త‌లు కార్య‌క్ర‌మంలో సుజాత‌గా పరిచయమయ్యింది. ఆమె ఆ తరువాత జోర్దార్‌ వార్తలతో 'జోర్దార్‌ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత మాటీవీలో 'ఆహారం-ఆరోగ్యం' కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకేష్ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ కలిసి విదేశాలకు వెళ్ళారు. మొదటగా అమెరికాకి వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ హోమ్‌ టూర్ పేరిట వ్లాగ్ , 'లండన్ ఫ్లైట్ మిస్ అయింది మా పరిస్థితి ఏంటి' వ్లాగ్, 'టైటానిక్ తయారు చేసింది ఇక్కడే కానీ మునగడానికి కారణం ఏంటి' వ్లాగ్ లు చేయగా వాటికి మంచి వ్యూస్ వచ్చాయి.

తాజాగా థాయ్ లాండ్ టూర్ కి వెళ్ళిన రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత.. అక్కడ అంతా తిరుగుతూ ఓ వ్లాగ్ చేశారు. " పులిలాంటి భార్యతో ఆడపులితో బ్రేక్ ఫాస్ట్ " అనే వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు. ఇందులో పులిదగ్గర నిల్చొని సుజాత, రాకేష్ ఫోటోలు దిగుతూ సరదాగా గడిపారు. ఇక పులిని దగ్గర నుండి చూసిన సుజాత భయపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కలిసి చేసిన ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తోంది.