English | Telugu

బిగ్ బాస్ లవ్ జోడి ఇప్పుడు సూపర్ జోడీగా...


బిగ్ బాస్ సీజన్ 5 లవ్ జోడి ఇప్పుడు సూపర్ జోడిగా మారి ఆడియన్స్ ముందర అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. వాళ్లెవరో కాదు మానస్ నాగులపల్లి- ప్రియాంక. సూపర్ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేశారు. బిగ్ బాస్ మొత్తం కూడా ఈ ఇద్దరి లవ్ ట్రాక్ నడిచింది. మానస్ కోసం ఏదైనా చేసేలా కనిపించించేది ప్రియాంక.. మానస్ కి గేమ్స్ లో సపోర్ట్ చేస్తూ, మానస్ నే కలవరిస్తూ ఉండేది. చాలా సార్లు ప్రియాంక మానస్ కి ఐ లవ్యూ కూడా చెప్పింది.

ఐతే ఇదంతా వన్ సైడ్ మాత్రమే మానస్ దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. బిగ్ బాస్ తర్వాత ఎవరి దారి వాళ్ళదైపోయింది. కానీ మానస్ టాపిక్ వస్తే మాత్రం మెలికలు తిరిగిపోతూనే ఎమోషనల్ ఐపోతుంది పింకీ . ఐతే వీళ్ళ లవ్ ట్రాక్ గురించి మానస్ వాళ్ళ అమ్మ అప్పట్లో చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రియాంక మానస్ ని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోను అని చెప్పేసింది. కావాలంటే తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని కూడా చెప్పారు. తర్వాత మానస్ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకున్నాడు. ప్రియాంక మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. అలాంటి ఆ జోడి ఇప్పుడు మళ్ళీ ఆడియన్సు ముందుకు రాబోతోంది. శివ-మానస్-ప్రియాంక జోడీగా చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రియాంక కళ్లలో మానస్ ని చూసిన ఆనందం తెలిసిపోతోంది. ప్రియాంక చేతులు పట్టుకున్న ఉదయభాను "మానస్ వచ్చాడన్న ఆనందంలో పింకీ చేతులు చల్లగా ఉన్నాయి ఐస్ గడ్డలాగా" అంది. ఆ కామెంట్ తో మానస్ ప్రియాంక పక్కకొచ్చి ఆమె భుజాన్ని పట్టుకునేసరికి "పెట్టుకోవద్దు మళ్ళీ వేడైపోతా" అంటూ ఒక హాట్ డైలాగ్ తో అందరికీ షాకిచ్చింది. "పింకీ చాలా పెయిన్ ఫుల్ జర్నీని ఇంత అందంగా తీసుకుని ఈ స్టేజిలో ఉందంటే నిజంగా హ్యాట్సాఫ్" అంటూ కితాబిచ్చారు రఘు మాష్టర్. ప్రియాంక తన జర్నీని తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకుంది.