English | Telugu

రోహిణిని బర్రెతో పోల్చిన బులెట్ భాస్కర్

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి రౌడీ రోహిణి, బులెట్ భాస్కర్, నాటీ నరేష్, వర్ష, ఇమ్మానుయేల్, తాగుబోతు రమేష్ వచ్చారు. ఈ వారం షోకి రిట్రో థీమ్ గెటప్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. బులెట్ భాస్కర్ కొడుకుగా నటించాడు నాటీ నరేష్. "నాన్నగారు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను" అని నరేష్ చెప్పేసరికి "మావయ్యగారు ఆశీర్వదించండి" అంటూ రౌడీ రోహిణి భాస్కర్ కాళ్ళ మీదకు వంగింది. "పెళ్లి చూసుకున్నావా సంతకి వెళ్లి బర్రెను కొన్నావా" అనేసరికి నరేష్, రోహిణి షాకయ్యారు. "దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అని కండిషన్ పెట్టాడు భాస్కర్.

"నేను మూటలు మోస్తాను, రాళ్లు కొడతాను, ఒళ్ళు వంచి చెమట చిందించి ఐదు రౌండ్లు" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ ని నరేష్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. "నాన్నగారు మీకు తెలియకుండా ఒక బాబును కూడా పుట్టించాం" అన్నాడు కామెడీగా. తర్వాత "ఊ అంటావా మావా"అనే సాంగ్ కి వర్ష, రోహిణి డాన్స్ చేసేసరికి "అది నడుమా, రుబ్బురోలా అలా తిప్పుతున్నావ్" అన్నాడు ఇమ్మానుయేల్. ఇక తాగుబోతు రమేష్ వర్షాని పటాయించాడు "ఈ చిత్రం చూసి" అనే సాంగ్ కూడా పాడేశాడు ఆమె కోసం. "వర్షా నిన్ను ఎప్పటినుంచో ఒక విషయం అడుగుదామనుకుంటున్నా" అన్నాడు రమేష్. దాంతో వర్ష "అది కాదు ఇమ్ము" అని పిలిచేసరికి రమేష్ షాకైపోయాడు. "మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి చెయ్యి పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం" అంటూ తన తప్పును కవర్ చేసుకోవడానికి రమేష్ చేతుల్ని పొగిడేసింది అమ్మడు. "నాకు మాత్రం ఇవి అమ్మాయి చేతుల్లా అనిపించడం లేదే" అని రమేష్ అనేసరికి "నువ్వు పట్టుకున్నది కూడా అమ్మాయి చేతులు కాదు అబ్బాయి చేతులే" అంటూ పక్కనుంచి ఇమ్ము వర్షాని అబ్బాయితో పోల్చి పరువు తీశారు. ఇలా ఈవారం సుమ అడ్డా షో మంచిగా ఎంటర్టైన్ చేయబోతోంది.