English | Telugu
చెప్పులు లేకుండా నేల మీద నడిచి, ఎండలో వర్కౌట్ చెయ్యి..దేవుడిని జపించు
Updated : Jan 30, 2024
విష్ణుప్రియ బుల్లితెర మీద హోస్ట్ గా చేస్తూ అప్పుడప్పుడు మూవీస్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి విష్ణు ప్రియా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది. అంతే కాదు ఒక పర్సన్ ని మోటివేట్ చేసింది. "యూట్యూబ్ నుంచి టీవీ వరకు మీ జర్నీ అద్భుతం..తలచుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది..అలా మీ జర్నీ సాగటానికి ఎలా మోటివేట్ అయ్యారు " అని అడిగేసరికి "సున్నా నుంచి ప్రారంభించడం అద్భుతంగా అనిపిస్తుంది. నచ్చిన రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ ఐనప్పుడు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది.
ఎంతో మంది ఆశీర్వాదాల వల్లే నేను ఇంతవరకు ఎదిగాను అనుకుంటున్నాను. నేను ఎంతో మందిని నవ్విస్తున్నాను. ఈరోజు నా జర్నీ చూసుకుని నాకు ఒక డ్రీం లానే అనిపిస్తుంది. " అని చెప్పింది. " నేను లైఫ్ లో చాలా కష్టాలు పడుతున్నాను. కొన్నిసార్లు నాకే సందేహం వస్తుంది నేను లైఫ్ లో ఫెయిల్ అయ్యానా అని" " కష్టతరమైన దశలు ఎన్ని వచ్చినా అవి చాలా మంచి దశ అని అనుకోవాలి. ఎందుకంటే కష్టం ఉన్నప్పుడే జీవితం పదునుగా మారుతుంది. భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఎన్నో యుద్ధాలకు నిన్ను సిద్ధం చేస్తుంది.. దృఢంగా ఉండేలా చేస్తుంది. నాకు కూడా ఒక్కోసారి ఇలాగే అనిపిస్తుంది..కానీ అప్పుడు నేను ఆ భగవంతుడి నామాన్ని జపించుకుంటాను..
మీ గమనం ఏమిటో ఎక్కడికో తెలుసుకోండి. ఒక్కసారి చెప్పులు లేకుండా నేల మీద నడవండి, ఎండలో వర్కౌట్ చేయండి..మీకు మీ దారి ఏంటనేది తెలుస్తుంది.. కష్టాలు ఒక భాగం మాత్రమే..దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండి ...ఫీల్ అవకండి. " అంటూ అద్భుతమైన సలహా ఇచ్చింది. "మీ కామెంట్ సెక్షన్ ని ఎందుకు క్లోజ్ చేశారు" అని అడిగేసరికి "ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది.. నేను వారి అభిప్రాయాలను కొన్ని సార్లు ఆపలేని పరిస్థితి ఉంటుంది... కాబట్టి అలాంటి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా కామెంట్ చేయకుండా ఉండేందుకే నేను కామెంట్ సెక్షన్ ని క్లోజ్ చేసాను" అని చెప్పింది విష్ణు ప్రియా.