English | Telugu

పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి.. ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన బర్రెలక్క

బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలుసు. తెలంగాణ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో అందరిని దాటుకుని టైటిల్ కొట్టాడు. అయితే టైటిల్ గెలిచిన తర్వాత పోలీసుల హడావిడి తర్వాత పల్లవి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక జరిగిన గొడవల వలన ఆటను బాగా మైనస్ గా మారింది. మరో పక్క తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడి బర్రెలక్క సంచలనం సృష్టించింది. గేదెలు కాసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఎలక్షన్స్ లో గెలవకపోయినా బాధపడకుండా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా నిలబడతానని గట్టిగానే చెప్పింది.

అలాంటి పల్లవి ప్రశాంత్, బర్రెలక్క గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ట్రోల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, రోజా వచ్చి, రష్మీ, సుదీర్ వచ్చి పెళ్లి చేశారని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వెర్షన్ వినిపించింది. " నాకు.. ప్రశాంత్ కి పెళ్లి అనే ఈ వార్తలు వినలేదు. వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారనుకుంటా. నిజం చెప్పాలంటే నేను ప్రశాంత్ ను అన్న అని పిలుస్తా.. అన్నలను ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా ? మనం మంచి పని చేస్తే మీడియా నుంచి కచ్చితంగా వద్దు అనుకున్నా సపోర్ట్ వస్తుంది..నాకు ఇవన్నీ విన్నప్పుడు బాధ కలుగుతోంది..జనాలే వాళ్లకు రెస్పాన్స్ ఇస్తారు. ఇదంతా ఫేక్ న్యూస్. ప్రతీ దానికి రెస్పాండ్ కావడం వేస్ట్ . థంబ్ నెయిల్ ఒక రకంగా ఉంటుంది. లోపల మ్యాటర్ మరో విధంగా ఉంటుంది. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు..వేరే వాళ్ళు చూపించారు ఆ థంబ్ నెయిల్స్ ని" అని చెప్పింది బర్రెలక్క.