English | Telugu
Krishna Mukunda Murari:దొంగచాటుగా భార్య నడుము చూస్తుండిపోయిన భర్త!
Updated : Jan 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -381 లో.. మీరంటే ముకుందకి ప్రేమ గౌరవం అమ్మ అని భవానికి ఆదర్శ్ చెప్తాడు. ఇప్పుడు అదంతా ఎందుకని ఆదర్శ్ ని చెప్పకుండా ఆపుతుంది. ఒకరిపై ఇష్టం ప్రేమ ఉన్నాయని చెప్పాలా వారికి ఇచ్చే విలువ బట్టి తెలుస్తుందని ముకుంద చెప్తుంది. ఈ సమాధానంతో అక్కకి ముకుందపై ఉన్నా అనుమానం పోతుందని అక్కడే ఉన్న రేవతి అనుకుంటుంది.
ఆ తర్వాత డ్రింక్ చేసి ఉన్న మురారి వెళ్లి.. కృష్ణ పడుకునే ప్లేస్ లో వెళ్లి పడుకుంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి మీరు వెళ్లి బెడ్ పై పడుకోండని చెప్తుంది. అయిన మురారి వినడు. నేను కూడా బెడ్ పైనే పడుకుంటాను కానీ అటువైపు నేను.. ఇటు వైపు మీరు.. దగ్గరంటు దూరంగా ఉందామని కృష్ణ అంటుంది. మరుసటిరోజు ఉదయం ఆదర్శ్ లేచేసరికి ముకుంద ఉండదు. ఇంత త్వరగా లేచిందా అని ఆదర్శ్ పక్కకి చూసేసరికి కింద చాప వేసి ఉంటుంది. అది చూసి ఆదర్శ్ షాక్ అవుతాడు. ముకుంద నా పక్కన పడుకోకుండా కిందపడుకుందా? అంటే నేను అంటే ఇష్టం లేదా అని ఆదర్శ్ అనుకుంటాడు. అప్పుడే ముకుంద వస్తుంది. అదే విషయం ముకుందని అడుగుతాడు. నేను అంటే నీకు ఇష్టం లేదా.. అలా కింద పడుకున్నావని ఆదర్శ్ అడగ్గానే.. మన శోభనానికి ముహూర్తం పెట్టలేదు కదా అందుకే అని ముకుంద తెలివిగా సమాధానం చెప్తుంది. సారి ఆదర్శ్ నిన్ను మోసం చేస్తున్నానని ముకుంద తన మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత మురారి దగ్గరకి కృష్ణ వచ్చి నిద్ర లేపుతుంది. త్వరగా వెళ్లి స్నానం చేసి రండి అని మురారిని పంపిస్తుంది. మురారి స్నానం చేసి వస్తాడు. బెడ్ సర్దుతున్న కృష్ణ నడుము చూస్తూ మురారి ఉండిపోతాడు. కాఫీ తన చేతిలో పెట్టి త్వరగా కిందకి వెళ్తే సర్ ప్రైజ్ అని మురారికి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.