English | Telugu

Eto Vellipoyindhi Manasu:కాలేజీలో మాణిక్యాన్ని చూసి కంగుతిన్న సీతాకాంత్.. తన గతం అడిగిన రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -8 లో.. సిరి సెక్యూరిటీని పంపించి ధనతో కబుర్లు చెప్తుంటుంది. సెక్యూరిటీ తన చెల్లె సిరి దగ్గర లేరన్న విషయం తెలుసుకున్న సీతాకాంత్ హడావిడిగా కాలేజీకి వస్తాడు. అప్పుడే తన కొడుకు చదువుతున్న కాలేజీ ఎలా ఉందో చూడడానికి మాణిక్యం కూడా కాలేజీకి వస్తాడు.

ఆ తర్వాత కాలేజీలో సిరి గురించి సీతాకాంత్ వెతుకుతుంటాడు.. సిరికి ధన చెప్పే కవితలు బోర్డుపై రాసి చూపిస్తు ఉంటాడు. సిరి కోసం వెతుకుతున్న సీతాకాంత్ కి మాణిక్యం కనపడడంతో షాక్ అవుతాడు. తన చెల్లె సిరిని ఏమైనా చేస్తాడేమోనని కంగారుపడుతాడు. అంతలోనే సీతాకాంత్ కి మాణిక్యం కన్పించడు. ధనని చూసి మాణిక్యం దగ్గరకి వస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఇక్కడికి రాకూడదని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత సిరి దగ్గరకి సీతాకాంత్ వచ్చి పక్కకి తీసుకొని వెళ్తాడు. అప్పుడే సెక్యూరిటీ వస్తారు. ఎందుకు వదిలేసి వెళ్లారంటూ వాళ్ళని సీతాకాంత్ కొడుతాడు. ఆ తర్వాత సిరిని ఇంటికి పంపిస్తుంటే.. నాకు ఎందుకు అన్నయ్య ఈ టార్చర్. నువ్వు ఇలా చేస్తే నేను కాలేజీ మానేస్తానని సిరి అంటుంది. అయిన వినకుండా సిరిని ఇంటికి పంపిస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత నువ్వు ఎందుకు వచ్చావ్ కాలేజీకీ అని మాణిక్యాన్ని రామలక్ష్మి అడుగగా... నా కొడుకు చదివే కాలేజీ చూడడానికి వచ్చానని మాణిక్యం అంటాడు. ఈ కాలేజీ చూస్తుంటే డబ్బున్న అమ్మాయిలందరు ఈ కాలేజీలోనే చదువుతున్నట్టున్నారు. ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చెయ్ అని చెప్పగానే.. డబ్బులు చూసి నేను అలా లవ్ చేసే టైప్ కాదని ధన చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యాన్ని రామలక్ష్మి అక్కడ నుండి పంపించేస్తుంది. కాలేజీ ఫీజు ధనకి ఇచ్చి నాన్న చెప్పినట్టు కాకుండా బాగా చదువుకోమని రామలక్ష్మి చెప్తుంది.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఉంటారు కానీ ఒకరికొకరు చూసుకోరు. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు సీతాకాంత్. చెల్లి సిరికి భోజనం పట్టుకొని తను ఉండే గదికి వెళ్తాడు. కానీ సిరి మాత్రం సీతాకాంత్ బాధపడేలా మాట్లాడుతుంది. సీతాకాంత్ బయటకు వచ్చి ఆలోచిస్తుంటే వాళ్ళ అమ్మ, తాతయ్య వచ్చి ఏమైందని అడుగుతారు. ఆ మాణిక్యం నాకు కన్పించడని‌ సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యం దగ్గరకి రామలక్ష్మి వచ్చి.. అసలు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా మారిపోయావని అడుగుతుంది. కానీ మాణిక్యం ఏం చెప్పడానికి ఇష్టపడడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.