English | Telugu

మోడీని రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ గా చేసిన శ్వేతానాయుడు



ఢీ సెలబ్రిటీ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అందులోనూ కంటెస్టెంట్స్ కి రిట్రో థీమ్ ఇచ్చారు మేకర్స్. ఈ షోలో ఆది దొంగ గెటప్ లో వచ్చి షోలో ఉన్న అందరి మొబైల్స్ దొంగతనం చేసి వాళ్ళ వాళ్ళ బండారాలను బయటపెట్టాడు. ఇది చూసిన శేఖర్ మాష్టర్ ఆది సెల్ తీసుకుని అతని బండారం బయట పెట్టాడు. శేఖర్ మాష్టర్ ఫోన్ తీసేసరికి అది లాక్ వేసి లేదు. అది చూసి ఆయనకు లాక్ తియ్యడం తప్ప వేసే అలవాటు లేదంటూ కౌంటర్ వేశారు. భూమిక నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయా అనేసరికి శేఖర్ మాష్టర్ సిగ్గుపడిపోయారు.

తర్వాత జెస్సి మొబైల్ తీసుకుని సెర్చ్ లిస్ట్ చూసాడు. "ముత్తైదువకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఫంక్షన్స్ లో చీర ఎలా కట్టుకోవాలి" అనేవి సెర్చ్ చేసాడని చెప్పి పరువు తీసాడు ఆది. తర్వాత శ్వేతా నాయుడుని స్టేజి మీదకు పిలిచాడు హోస్ట్ నందు...ఆది మీద ఒక కవిత చెప్పమనేసరికి "ఆది ఆది నా గుండెల్లో గుచ్చావు సూది.. నీ సెన్సాఫ్ హ్యూమర్ కి ఐపోయాను బందీ.. మన రాష్ట్ర ప్రైమ్ మినిస్టర్ మోడీ.. నా ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఆది" అంటూ మోడీ గారిని రాష్ట్ర ప్రైమ్ మినిస్టర్ ని చేసేసింది. రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారన్న విషయం ఈరోజు తెలిసిందంటూ కౌంటర్ వేసాడు నందు. ఇక కుమార్ మాష్టర్ సెల్ లో ట్రైన్ ఆంటీ, కూరగాయల ఆంటీ, ఇస్త్రీ పెట్టి ఆంటీ, టిఫన్ కొట్టు ఆంటీ ఇలా ఫీడ్ చేసుకున్న పేర్లు చదివి చెప్పి నవ్వించాడు. ఇక ఆది బండారం బయట పెట్టాడు శేఖర్ మాష్టర్. వెంటనే ఆది తన ఖాతాలన్నీ బయటపడిపోతాయి అంటూ గబగబా వెళ్ళాడు. అప్పటికే ఆదికి వచ్చిన కాలర్స్ పేర్లు చదివేసారు శేఖర్ మాష్టర్ "రసిక రాణి, జింగిడి జ్యోతి" అంటూ ఆదికి వాళ్లకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా చదివేసరికి ఆది తన ఫోన్ లాగేసుకున్నాడు. ఇలా ఈ వారం ఢీ షో సాగింది.