English | Telugu

పెళ్లి డేట్ ఫిక్స్.. ప్రియాంకతో హనీమూన్ నెవర్ ఎండింగ్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆడపులిలా చెలరేగి టాప్ లో నిలిచిన ప్రియాంక ఎట్టకేలకు తన పెళ్ళి డేట్ ని ఫిక్స్ చేసింది. ఎన్నో వీడియోలలో పెళ్ళి ఇక ఉంటుందంటు ఊరిస్తున్న ప్రియాంక, శివ్ కుమార్.. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కి తెర తీసారు. నిజాలు చెప్పేశారు.

ప్రియాంక, శివ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలియజేసారు. మీ రిలేషన్ పై వచ్చే నెగెటివ్ కామెంట్ల గురించి ఏం చెప్తారని ప్రియాంకని అడుగగా.. మా రిలేషన్ గురించి మాకు క్లారిటీ ఉంది. బయట మాపై వచ్చే కామెంట్లను పట్టించుకోం. పట్టించుకుంటే హ్యాపీగా ఉండలేం. కానీ ప్రతి కామెంట్‌లను తీసుకుంటాం.. బ్యాడ్ కామెంట్స్‌ని వదిలేస్తాం. బిగ్ బాస్ నుంచి నేను నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చా. క్రిటిక్స్ లేకుండా ఏ మూవీ సక్సెస్ అవ్వదు. నా బిగ్ బాస్ జర్నీ కూడా అంతే. కావాలని నెగిటివ్ చేస్తారు. వాటిని నేను పట్టించుకోనని ప్రియాంక అంది. ఇక పెళ్ళి డేట్ ఎప్పుడని అడుగగా.. చేసుకుంటాం.. కచ్చితంగా ఈ సంవత్సరం చేసేసుకుంటామని శివ్ అన్నాడు. పెళ్లి అయ్యాక.. హనీమూన్ గుర్తిండిపోయేట్టు చేసుకుంటాం. ఒక్కసారి మాత్రమే హనీమూన్ చేసుకోం. ప్రియాంకని ప్రతీ ఒక్క దేశం తీసుకుని వెళ్లి హనీమూన్ చేసుకుంటాను. మాది నెవర్ ఎండింగ్ హనీమూన్ అంటు బోల్డ్ కామెంట్స్ చేశాడు శివ్ కుమార్.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. శివ్ కుమార్, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి ' మౌనరాగం' సీరియల్ నుండి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.