English | Telugu

నేను రమ్మని అడుక్కోవాలా ఏంటి...ఫ్రెండ్ కాదన్నాడుగా

బిగ్ బాస్ సీజన్ 4 లో సయ్యద్ సోహైల్, అఖిల్ సార్థక్ ఎంత మంచి ఫ్రెండ్సో మనకు తెలుసు. అలాంటి వాళ్ళ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ లు ఎందుకొచ్చాయో కానీ ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ సార్థక్ సోహైల్ ఇక తన ఫ్రెండ్ కాదన్నట్టుగా కామెంట్ చేసాడు. ఇప్పుడు సోహైల్ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆ మాటలను తిప్పికొట్టాడు. బూట్ కట్ బాలరాజు మూవీ ప్రొమోషన్స్ కి రమ్మని తన బిగ్ బాస్ సీజన్ ఫ్రెండ్స్ ని అడిగితే హారిక వచ్చే పరిస్థితిలో లేదని మెసేజ్ ఇచ్చిందని చెప్పాడు. ఇక అఖిల్ తాను రావాలని అనుకోవడం లేదన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టాడని చెప్పాడు. "నేను అఖిల్ ఒక కాలేజ్ ఫంక్షన్ లో కలిసాం తర్వాత లంచ్ కి ఎటైనా వెళదాం అన్నాను కానీ కుదరదు ఇంటికెళ్లాలని చెప్పి తన రూమ్ కి వెళ్ళాడు.

నేను ఎన్ని సార్లో ఫోన్స్ చేసాను. కట్ చేసాడు. దానికి నేనేం చేయాలి...రారారా అని నేనేమన్నా అడుక్కోవాలా ఏమిటి..నా సైడ్ నుంచి నేను బాగున్నా..తన పర్సనల్ డిస్టర్బెన్స్ వలన అదంతా నా మీద పెట్టుకున్నాడో ఇంకేమన్నా జరిగిందో తెలీదు..కాబట్టి ఎవరి స్పేస్ లో వాళ్ళం ఉన్నాం" అని చెప్పాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకు సోహైల్ కి మధ్య ఒకప్పుడు ఫ్రెండ్ షిప్ ఉండేదని కానీ ఇప్పుడు అది లేదని ..లేని దాన్ని చెప్పుకోవడం ఎందుకు అంటూ కామెంట్ చేసాడు. "ఎవరి కెరీర్స్ తో వాళ్ళం బిజీగా ఉన్నాం. ఎప్పుడూ ఒకరితోనే ఫ్రెండ్ షిప్ కంటిన్యూ కావాలని లేదుగా. ప్రయారిటీస్ బట్టి కూడా రిలేషన్స్ మారతాయి. సోహైల్ ఫ్రెండ్ అందులో ఎలాంటి డౌట్ లేదు" అంటూ అఖిల్ కామెంట్ చేసాడు.