English | Telugu

తమన్నాతో రెచ్చిపోయి డాన్స్ చేసిన అవినాష్..

శ్రీముఖి వీకెండ్స్ వస్తే ఫుల్ ఛిల్ అవుతూ ఉంటుంది. వారం మొత్తం షూటింగ్స్ అని మీటింగ్స్ అని ఫుల్ హడావుడిగా రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యింది శ్రీముఖి. ఫార్గో ట్రీ హౌస్ కి వెళ్లి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఒక్కతే వెళ్లకుండా వెంట ఆర్జే చైతు, అవినాష్, తమన్నా సింహాద్రిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళింది. ఇక శ్రీముఖితో తన తమ్ముడు సుశృత్ కూడా వెళ్ళాడు. ఎన్నో నెలల నుంచి రెస్ట్ లేకుండా పని చేస్తూ ఇల్లు, షూటింగ్స్ అని తిరగడం సరిపోతోంది కాబట్టి కొంచెం రెస్ట్ కోసం అన్నట్టుగా ఒక ఫార్మ్ స్టేకి వెళ్లాలని తన తమ్ముడు పట్టుబట్టేసరికి ఇక వెళ్లక తప్పింది కాదు అంటూ చెప్పింది శ్రీముఖి.

అలాగే 2024 లో ఇదే తన ఫస్ట్ వ్లాగ్ అని చెప్పింది. ఇక వీళ్లంతా కార్ లో కూర్చున్నాక సరదాగా ఫన్నీగా జోక్స్ వేసుకుని నవ్వుకున్నారు. ఇక ఆ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాక శ్రీముఖి ఎలా యాంకరింగ్ చేస్తుంది అనే విషయాన్ని ఒక స్టాండప్ కామెడీ చేసి చెప్పాడు అవినాష్. ఇక అక్కడ సాయంత్రమయ్యి చీకటి పడేసరికి అవినాష్ తన విశ్వ రూపాన్ని చూపించాడు. కార్ లో వెళ్ళేటప్పుడు తమన్నా సింహాద్రితో సరసాలాడాడు. అలాగే ఫార్మ్ హౌస్ కి వెళ్ళాక అక్కడైతే హాట్ సాంగ్స్ పెట్టుకుని తమన్నాతో ఇరగదీసి స్టెప్స్ తో హాట్ హాట్ గా డాన్స్ చేసాడు. చల్లటి వాతావరణంలో తమన్నా, అవినాష్ గ్రిల్ల్డ్ చికెన్ తిన్నారు. ఇలా వీళ్లంతా ఫార్మ్ హౌస్ లో ఫుల్ ఛిల్ల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అవినాష్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కంటెస్టెంట్ ఆర్జే చైతుతో కలిసి శ్రీముఖి ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేసింది. తమన్నా సింహాద్రితో శ్రీముఖికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అలాగే అవినాష్ తో కూడా అంతే బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఉంది. శ్రీముఖి ఎక్కడికి వెళ్లినా ఏ షో చేసిన అందులో కచ్చితంగా అవినాష్ ఉండాల్సిందే. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి కారణం కూడా శ్రీముఖినే అని అవినాష్ ఎన్నో సార్లు చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.