English | Telugu

శ్రీముఖి చేసిన మొదటి వ్లాగ్ ఇదే!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ కి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇక ప్రస్తుతం ఇన్ స్ట్రాగ్రామ్ లో 90's వెబ్ సిరీస్ రీల్స్, కుమారీ ఆంటీ వ్లాగ్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా గత కొన్ని నెలలుగా యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయకుండా ఉన్న శ్రీముఖి .. ఈ సంవత్సరం కొత్త వ్లాగ్ తో ముందుకొచ్చింది.

శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవిరంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి. జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది.

ఈ సంవత్సరంలో సెలబ్రిటీలంతా తమ వ్లాగ్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటే.. శ్రీముఖి మాత్రం ఇప్పటికి కళ్ళు తెరిచింది. తన బిజీ షెడ్యూల్ లో ఓ రెండు రోజులు తన తమ్ముడు సుశ్రుత్, ఫ్రెండ్స్ తో కలిసి అలా ఓ ట్రిప్ కి వెళ్ళింది. అది ట్రీ పామ్ అంట.. అక్కడ ట్రీ చుట్టూ రెసార్ట్ చేశారని.. చూడటానికి ఓ మినీ లగ్జరీ హోటల్ లా ఉందంటు శ్రీముఖి ఈ వీడియోలో చెప్పింది. అయితే ఈ ట్రిప్ లో ఆర్జే చైతు, ముక్కు అవినాష్ కూడా జతవ్వడంతో మరింత వినోదాత్మకంగా గడిచిందని శ్రీముఖి అంది‌. కాగా ఈ సంవత్సరంలో శ్రీముఖి చేసిన‌ మొదటి వ్లాగ్ ఇదే కావడంతో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..