English | Telugu

రెండు కార్లు కొన్న ఆట సందీప్, జ్యోతిరాజ్ !

పూర్వకాలంలో పెద్దలు ఓ మాట చెప్పేవారు.. కష్టేఫలి.. అంటే నువ్వెంత కష్టపడితే అంత ఫలితం నీకొస్తుంది. అది అక్షరాల నిజమని ఆట సందీప్ అతని భార్య జ్యోతిరాజ్ తెలియజేసారు. పన్నెండు సంవత్సరాల ఆటసందీప్, జ్యోతిరాజ్ ల జీవిత ప్రయాణంలో తనకి ఇచ్చిన మొదటి కార్‌ ఇదేనని జ్యోతిరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్.. మారుతి సుజూకి ఇగ్నైస్, థాంక్స్ టూ మై లవ్లీ హస్బెండ్ ఫర్‌ దిజ్ గిఫ్ట్. పన్నెండు సంవత్సరాల హార్డ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ.. నా బెటర్ హాఫ్ తో సక్సెస్ ఫుల్ గా కలిసి ఉన్నాను. స్మాల్ కార్ విత్ బిగ్ హార్ట్ అంటూ జ్యోతిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో కార్ ని ఆటసందీప్ సర్ ప్రైజ్ గా జ్యోతికి ఇచ్చిన వీడియోని పోస్ట్ చేసింది. ఇక మరో కార్ మహేంద్ర XUV 700 కార్ ని ఆట సందీప్ తీసుకున్నాడు. ఇది ఆట సందీప్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. హర్డ్ వర్క్ నెవెర్ ఫెయిల్స్ .. దిజ్ ఈజ్ మై న్యూ కార్ అని ఆట సందీప్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.‌ అయితే ఈ రెండు కార్లు ఇద్దరు కలిసి ఒకే సారి తీసుకోవడం బాగుందంటూ వీరి డ్యాన్స్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక టేస్టి తేజ అయితే .. కంగ్రాట్యులేషన్స్ మాస్టారు.. టూ కార్స్ టూ పార్టీస్ కావాలని కామెంట్ చేశాడు.

ఆట సందీప్ నటించిన 'ది షాట్ కట్' మూవీ టీజర్ ని తాజగా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత చేసిన తొలి మూవీ కాబట్టి ఈ సినిమా కథ మీద ఆసక్తి అందరిలో నెలకొంది. స్పా బ్యాచ్ తో ఎక్కువగా ట్రావెల్ అయిన హౌస్ మేట్ ఆట సందీప్. ఆట సందీప్, అమర్ దీప్ తో కలిసి ఎన్నో గేమ్స్, టాస్క్ లలో ఫౌల్ చేశాడు. ఇక మొట్ట‌మొదటి హౌస్ మేట్ గా గెలిచి ఆరువారాల ఇమ్యూమిటీ పొంది నామినేషన్ లో లేడు. ఆ తర్వాత కెప్టెన్ గా గెలిచి మరో వారం నామినేషన్ లో మిస్ అయ్యాడు.‌ ఇక తొమ్మిదవ వారం టేస్టీ తేజ నామినేషన్ చేయడంతోనే ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆట సందీప్.‌ తొమ్మిది వారాలు ఓ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండకుండా హౌస్ లో ఉండటం ప్రథమం అయితే బయటకు రావడం ఇదే తొలిసారి జరిగింది. ‌ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువ స్నేహంగా ఉన్న ఆటసందీప్.. ఆ తర్వాత ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక‌ ఎవరు జెన్యున్ ప్లేయర్? ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో‌ తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఆట‌ సందీప్, జ్యోతిరాజ్ కలిసి అయోధ్య రాముడి కోసం చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ తాజాగా మిలియన్ మార్కుని కూడా దాటింది.