English | Telugu

అతనిచ్చిన డబ్బులతోనే కుమారి ఆంటీ షాప్.. ఆర్జే చైతు ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలు!


అన్న మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా. కుమారి ఆంటీ డైలాగ్.. ఈ ఒక్క డైలాగ్ తో ఇన్ స్టాగ్రామ్ మొత్తం గత రెండు మూడు వారాలుగా ఒక్కటే మ్యూజిక్.. ఎక్కడ చూసిన కుమారి ఆంటీ రీల్స్, మీమ్స్.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది కుమారి ఆంటి. హైదారాబాద్ లోని ఇనార్బిట్ మాల్ దగ్గరలో గల ఫేమస్ హోటల్ ITC కోహినూర్ ఉంటుంది. అ హోటల్ కి దగ్గరలో మధ్యాహ్నం టైమ్ లో చిన్న టెంట్ వేసుకొని.. ఫుల్ మీల్స్ తొంభై, భగారా రైస్ అరవై.. అంటూ భోజనం వడ్డిస్తుంది కుమారి ఆంటీ.

సాధారణంగా రోడ్డు పక్కన డబ్బులు తీసుకొని భోజనం పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు.‌ కానీ కుమారి ఆంటీ ఏ ముహుర్తానా ఆ వెయ్యి, రెండు లివర్లు ఎక్స్ ట్రా అందో అక్కడి నుండి ఫుల్ ఫేమస్ అయింది. ఇక ఎక్కడెక్కడి నుండో తన దగ్గరికి భోజనం చేయడానికి వస్తున్నారంట. ఇక అది తెలుసుకొని ఆ ప్లేస్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వచ్చి షాప్ క్లోజ్ చేపించారు. అయితే తను మళ్లీ షాప్ ఓపెన్ చేయాలని అక్కడ నిత్యం అన్నం తినేవాళ్ళు మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారిన కుమారి ఆంటీకి.. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుండి సినిమా హీరోల వరకు తమ సపోర్ట్ అందిస్తున్నారు. వీళ్ళతో‌ పాటుగా తెలంగాణ సీఎమ్ రేవంత్ రెడ్డి సైతం తన మద్దతుని తెలుపుతున్నట్టు బయట టాక్ నడుస్తోంది. అయితే కుమారి ఆంటీ షాప్ క్లోజ్ చేయడం గురించి తెలుసుకోవడానికి మీడియా ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఆర్జే చైతు తనని ఇంటర్వ్యూ చేశాడు.

ఆర్జే చైతు.. విజయవాడలో పుట్టి పెరిగాడు. రేడియో జాకీగా జాబ్ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో‌ అరంగేట్రం చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక ఆర్జే చైతుకి ఫుల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది‌.‌ ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇమ్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్, ఫోటోలతో ఫుల్ బిజీగా ఉండే చైతూ.. తాజాగా కుమారి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు.‌ ఇందులో తను కొన్ని విషయాలని పంచుకుంది. సింగర్‌ హేమచంద్ర వాళ్ళింట్లో‌ కుమారి ఆంటీ మొదట వంటమనిషిగా చేసేదంట. ఆ తర్వాత హేమచంద్ర తనకి ఓ ముప్పై వేలు ఇవ్వగా.. తను అక్కడ షాప్ పెట్టిందంట. మీకు హోటల్స్ నుండి ఆఫర్లు రాలేదా అని అడుగగా.. చాలా వచ్చాయి కానీ మా ఆయన వద్దన్నాడు. మనం చేసుకుంటే ఉన్నదాంట్లో హ్యాపీగా ఉంటాం .‌ ఒకరికింద చేయడానికి ‌మన సొంతంగా పని చేస్తూ లైఫ్ ని హ్యాపీగా చూసుకుంటే చాలదా అని అన్నారు అందుకే మేం వెళ్ళలేదని కుమారి ఆంటీ అంది. షాప్ క్లోజ్ చేసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారని అడుగగా.. చాలా భాదగా అనిపించింది. ‌కానీ ఏం చేస్తాం‌. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు.‌ కానీ అక్కడికి తినడానికి వచ్చేవాళ్ళంతా బాగా ఫీల్ అయ్యారని కుమారి ఆంటీ అంది. మీరు ఆడవాళ్ళకి ఏం అయినా చెప్పాలనుకుంటున్నారా అని అడుగగా.. ఇంట్లో‌ ప్రతీ భర్త, భార్యకి, ప్రతీ భార్య భర్తకి మధ్య అన్యోన్యత ఉంటే.. ఇంట్లో అందరూ కలిసి పనిచేస్తే సంతోషంగా ఉండొచ్చని కుమారి ఆంటీ అంది.‌ ఇలా కొన్ని విషయాలని పంచుకుంది కుమారి ఆంటీ. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.