English | Telugu

వైజాగ్ చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేసిన శివాజీ..బాలకృష్ణ, ఖుష్భూ


జబర్దస్త్ కమెడియన్ ఆర్పి నిర్వహిస్తున్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వైజాగ్ బ్రాంచ్ ని రీసెంట్ గా రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు బిగ్ బాస్ సీజన్ 7 లోని బిగ్ మోటివేటర్ శివాజీ. తర్వాత ప్రెస్ మీట్ లో శివాజీ మాట్లాడారు. "హలో వైజాగ్ .. కిర్రాక్ ఆర్పీ ఇంతింతై వటుడింతై అన్నట్టు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నాడు. వైజాగ్ లో మూడు బ్రాంచీలు ఓపెన్ చేసాడు. ఆర్కే బీచ్ లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. వైజాగ్ అంటే ఫుడ్ , బీచ్, సినిమా మాత్రమే ఉంటాయి. ఈ బ్రాంచెస్ మూడు కూడా సూపర్ సక్సెస్ కావాలని బాహుబలి 2 లా ఈ బిజినెస్ విస్తరించాలని విష్ చేస్తున్నా...హైదరాబాద్ లో ఈ బ్రాంచ్ ఎలా సక్సెస్ అయ్యిందో వైజాగ్ లో కూడా అలాగే సక్సెస్ అవుతుంది అని మనసారా కోరుకుంటున్నా" అన్నారు.

తర్వాత ఆర్పీ మాట్లాడుతూ " మణికొండ, అమీర్పేట్ లో పెట్టిన బ్రాంచెస్ అన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే బాలకృష్ణ గారు, ఖుష్బూ గారు సెలెబ్రిటీస్ అంతా ఆదివారం కానీ ఇతర రోజుల్లో కానీ వాళ్లకు కావలసినప్పుడు కుండల్లో వండించుకుని తీసుకెళ్తారు. కాజాగూడలో, తిరుపతిలో ఐదు బ్రాంచీలు సక్సెస్ అయ్యాయి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిది కూడా వైజాగ్...మా చేపల పులుసు నాణ్యతగా ఉంటుంది. రేట్లు కూడా కర్రీకి తగ్గట్టే ఉంటాయి మరి ఎందుకంటే నేను కూడా లాస్ కాలేను కదా. ఈ చేప అన్ని ప్రాంతాల్లో దొరకదు." అని చెప్పాడు. ఒకప్పుడు జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్ళిపోయాక ఆయనతో పాటు కిరాక్ ఆర్పీ కూడా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ. అలా ఈ చేపల పులుసు ఫుల్ ఫేమస్ అయ్యేసరికి చిన్నా , పెద్దా సెలబ్రిటీస్ అంతా కూడా క్యూ కడుతున్నారు. ఇప్పుడు వైజాగ్ బ్రాంచ్ ని బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న శివాజితో ఓపెన్ చేయించాడు. ఇక అక్కడికి వచ్చిన అభిమానులు శివాజీ బిగ్ బాస్ లో ఉన్నప్పటి ఫోటో లామినేషన్ ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని తెలిపారు.