English | Telugu

ఇరవై ఏళ్ళ వయసులో కరుణ ఫోటో..‌ ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్!

ఇన్ స్టాగ్రామ్ లో మూడు, నాలుగు రోజులకొకసారి కొత్త ట్రెండింగ్ వస్తుంటుంది. నిన్న మొన్నటి దాకా పాత పాటలు కూడా ఎవరైనా వింటారా..‌నేను వింటాగా అంటూ పాత సినిమాలలోని హిట్ పాటలన్నింటిని సెలెబ్రిటీలు తమ‌ ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసారు. ఇప్పుడేమో‌ మరో ట్రెండ్ వచ్చేసింది. అదేంటంటే ఇరవై ఏళ్ళ వయసులో మీరెలా ఉన్నారో తెలుసుకోండి అంటూ తమ ఫోటోలని షేర్ చేసే కొత్త ట్రెండింగ్ మొదలైంది.

అప్పుడెప్పుడో వచ్చిన 'మొగలి రేకుల' నుంచి నేటి 'వైదేహి పరిణయం' వరకు ఎన్నో సీరియల్స్‌లో నటించింది కరుణ భూషణ్. మొగలి రేకులు, శ్రావణ సమీరాలు, అభిషేకం, వైదేహి పరిణయం.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో తన అద్భుతమైన నటనతో మెప్పించింది కరుణ భూషణ్. ప్రస్తుతం బిజీగా ఉన్న బుల్లితెర తెలుగు యాక్టర్స్‌లో కరుణ కూడా ఉంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది. ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న ఫోటోని షేర్ చేసి ట్రెండింగ్ ని ఫాలో అయింది ఈ భామ.‌ అయితే తన ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

కరుణ ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఇలా అంది.. నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. 30 సినిమాల్లో యాక్ట్ చేసాను. ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోస్ అందరితో నేను నటించాను. "ఆహా" మూవీ ద్వారా నేను స్క్రీన్ మీద కనిపించాను. ఆ తర్వాత ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసాను. చిరంజీవి గారితో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ మూవీలో కూడా కనిపించాను. నా భర్త ఒక డైరెక్టర్‌. 2007లో తొలిసారి తను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఐ లవ్యూ అని చెప్పలేదు.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను ఆ మాటకు షాకయ్యాను. మా రిలేషన్‌ ఎలా సాగుతుందా అని అనుకున్నాను. కానీ అలా సాగిపోయింది. కొన్ని రోజులకి మేం విడిపోయామని కరుణ అంది. ఇక ఈ మధ్యకాలంలో కరుణ కొడుకు తనేదైనా హాట్ సారీ కట్టుకున్నా.‌ హాట్ గా కనిపించినా .. యూ లుకింగ్ హాట్ అని కాంప్లిమెంట్ ఇస్తాడని చెప్పడంతో అప్పట్లో అది వైరల్ గా మారింది. దాంతో మరీ ఇంత దారుణంగా ఎలా అవుతున్నారండి అంటు తెగ కామెంట్లు వచ్చాయి‌. అయితే ఇటువంటి కామెంట్లని తను పట్టించుకోకపోవడమే తన ఆనందానికి కారణమని చాలాసార్లు చెప్పింది కరుణ. అయితే తాజగా ఇన్ స్టాగ్రామ్ లో సాగే ఇరవై ఏళ్ళ ఫోటో షేరింగ్ లో భాగంగా కరుణ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.