English | Telugu

Jayam serial : రుద్రని అవమానించిన పారు.. గంగ ప్రతీకారం తీర్చుకోనుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -90 లో.....గంగ దగ్గరికి పెద్దసారు వస్తాడు. అప్పుడు గంగ వాటర్ క్యాన్ లు మోస్తుంటుంది. నువ్వు ఇలా కష్టపడడం నాకు ఇష్టం లేదు.. సూపర్ మార్కెట్ లో జాబ్ చెయ్యకుండా ఇదంతా అవసరమా అని కోప్పడతాడు. అటు మీ అమ్మ ఆరోగ్యానికి.. ఇటు మీ నాన్న అప్పు తీర్చడానికి ఇంత కష్టపడుతున్నావని గంగతో పెద్దసారు అంటాడు. అది నా కష్టంతోనే తీరుస్తానని గంగ అంటుంది.

ఇంట్లోకి రండి పెద్దసారు.. మంచి ఛాయ్ పెడతా మీకు అని గంగ అనగానే నేను రాను.. నా కూతురిని బాధ్యతగా చూసుకుంటానని మీ అమ్మగారితో అన్నాను.‌ కానీ ఇంట్లో నుండి గెంటేసారని మీ అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత గంగ లోపలికి వెళ్లి తులసి చెట్టు దగ్గర దొరికిన డబ్బు తీసుకొని వచ్చి పెద్దసారుకి ఇస్తుంది. ఉన్నోళ్ల ఇంట్లో చెట్టుకి డబ్బు కాస్తుందంటారు. ఇలాంటి వాళ్ళ ఇంట్లో కాస్తే భయమేస్తుందని గంగ అంటుంది. అటుగా ఉన్న మక్కంని చూసి తనే డబ్బు పెట్టి ఉంటాడని పెద్దసారుకి అర్ధం అయి డబ్బు తీసుకుంటాడు. నీలో నాకు నచ్చింది ఇదే గంగ అని పెద్దసారు అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరోవైపు రుద్రతో వచ్చిన స్నేహ కారు దిగి అకాడమీలోకి వెళ్తుంది. తను బ్యాగ్ మర్చిపోతే రుద్ర తీసుకొని వెళ్తాడు. అక్కడ తన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. అక్కడే పారు ఉంటుంది. రుద్రని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో రుద్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా గంగ చూస్తుంది. రుద్ర సర్ నే అవమానిస్తావా అని మాస్క్ పెట్టుకొని తన దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.