English | Telugu
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లో దొంగలు పడ్డారు.. సంజన సైలెన్సర్ వర్సెస్ మాస్ మాధురి!
Updated : Oct 22, 2025
బిగ్‌బాస్ సీజన్-9 లో ఏడో వారం కొత్త టాస్క్ మొదలైంది. హౌస్ లో ఈ వారం కెప్టెన్ అవ్వడానికి అందరికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్ లో సంజన-తనూజ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరిగాయి. వాష్ రూమ్ దగ్గర ఇమ్మాన్యుయల్-తనూజ మధ్య కూడా నువ్వా నేనా అన్నట్టుగా గొడవ సాగింది. ఆ తర్వాత బిగ్ బాస్ అసలు గేమ్ మొదలెట్టాడు. అందరికి దొంగల గెటప్ ఇవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో గెటప్ వేశారు.
నా పేరు సైకో సాంబ.. అంటూ డీమాన్ జబ్బల బనియన్ వేసుకొని వచ్చాడు. ఇది చూసి ఎవరివల్ల ఇలా తయారయ్యావని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇక నేను టిల్లు బావా ఆడపిల్లలందరికీ బావ.. అంటూ మగరాయుడి గెటప్ వేసుకొని మాధురి నడుము గిల్లేసింది తనూజ. దీంతో టిల్లు బావా ఒకసారి గిల్లు బావా అంటూ తనూజ వెంటపడ్డాడు ఇమ్మాన్యుయల్. దీనికి తనూజ నవ్వుతూ ఇమ్మూ భుజం మీద చేయి వేసి మనకి మనకి వద్దురా.. అంటూ డైలాగ్ వేసింది. అది అందరూ ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్‌లో అంటూ ముందు జరిగిన గొడవపైన కౌంటర్లు వేశాడు ఇమ్మాన్యుయల్. రమ్య కూడా మగ రౌడీలా రెడీ అయింది. ఎవరికన్నా మీసాలు మూతి మీద వస్తాయ్ దీనికేంటి గడ్డం మీద వచ్చినయ్.. మీసాలకి ఏం ఆయిల్ వాడతారు చెప్పరా అంటూ ఇమ్మాన్యుయల్ అన్నాడు. సుమన్ శెట్టి ఏమో లుంగీ కట్టుకొని పైన కర్చీఫ్ కట్టుకొని గట్టిగానే రెడీ అయ్యాడు. ఇది చూసి సర్ మీరు నాకు తెలుసు యుగానికి ఒక్కడు సినిమాలో విలన్ కదూ అంటూ ఇమ్మూ అన్నాడు. తర్వాత రెండు గ్యాంగ్‌లకి గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్.
డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొదటి అవకాశం.. గోలిసోడా.. ఈ పోటీలో తమ గ్యాంగ్‌లో ఉంటూ తమ తరఫున పోటీ పడటానికి ప్రతి గ్యాంగ్‌స్టర్‌కి ఇద్దరు పోటుగాళ్లు అవసరం.. ఎందుకంటే వారిలో నుంచి ఒకరు యాభై సోడాలు కొడుతుంటే ఇద్దరూ కలిసి మొత్తం మొత్తం సోడాలి తాగాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. మాధురి టీమ్ నుంచి డీమాన్-రమ్య.. సంజన టీమ్ నుంచి ఇమ్మూ-కళ్యాణ్ ఈ టాస్కులో పోటీపడ్డారు. సోడాలు కొట్టడం ఓకే కానీ తాగేటప్పుడే అందరికి తీరిపోయింది. ముప్పై సోడాలంటే మాటలు కాదుగా. అయినా ఎలాగోలా ఇమ్మూ-కళ్యాణ్ అయితే సోడాలు బాగానే లేపారు. ఇద్దరూ కలిసి డీమాన్-రమ్య కంటే ఎక్కువగా మొత్తం ఇరవై రెండు సోడాలు తాగి ఈ టాస్కులో గెలిచారు. హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెడ్ టీమ్ లీడింగ్ లో ఉంది.