English | Telugu

Bigg Boss 9 Telugu: ధమాకా కిక్ టాస్క్ లో రెడ్ టీమ్ గెలుపు.. మాధురికి ఊరేగింపు!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం ఆసక్తిగా సాగుతోంది. ‌ఎందుకంటే గౌస్ లో దొంగల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అంటు హౌస్ ని రెండు టీమ్ లుగా విభజించి దొరికినంత దోచుకో అంటూ దొంగలుగా మార్చాడు బిగ్ బాస్.

నిన్నటి ఎపిసోడ్ లో.. సంజన పానీపూరి అండ్ మాధురి కాఫీ స్టాల్ టాస్క్ ఇచ్చాడు. అందులో మొదటగా రెడ్ టీమ్ లోని రీతూ చౌదరి సంజన టీమ్ లోకి వెళ్ళగా ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ సంజన టీమ్ లోకి వెళ్ళాడు. బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టాడు. డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న రెండవ అవకాశం ధమాకా కిక్.. కాళ్లల్లో దమ్ము ఉండటం గ్యాంగ్‌స్టర్ ప్రొఫైల్‌లో అండర్‌లైన్ చేయదగ్గ అంశం.. ఎందుకంటే తమ కిక్‌తో ప్రత్యర్థి గుండెల్ని హడలెత్తించే సామర్థ్యం గ్యాంగ్‌స్టర్‌కి ఉండాల్సిన లక్షణం.. అది ఎవరిలో ఎంతుందో చూపించడానికి మరియు దాంతో డబ్బు సంపాదించడానికి గ్యాంగ్ లీడర్స్ మరియు గ్యాంగ్ మెంబర్స్‌కి ఇది ఒక అద్భుతమైన అవకాశం.. ఈ పోటీలో ప్రతీ గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు.. బజర్ మోగినప్పుడల్లా ప్రతి గ్యాంగ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి వెల్‌క్రో వాల్ ముందు నిలబడి కేవలం తమ కాలుని మాత్రమే ఉపయోగించి అక్కడున్న చెప్పును ఆ వాల్‌పై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతుక్కునేలా చేయాలి.. ఎవరి చెప్పు అయితే ఎక్కువ ఎత్తులో అతుక్కుంటుందో వారు ఈ రౌండ్‌లో విజేతలవుతారు. ఇలా ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ రౌండ్స్‌లో గెలుస్తుందో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది.. మరియు ఆ గ్యాంగ్ లీడర్‌కి రెండు వేల బీబీ క్యాష్ బహుమతిగా లభిస్తుంది.. ఓడిపోయిన గ్యాంగ్ గెలిచిన గ్యాంగ్ లీడర్‌ని భుజంపై ఎత్తుకొని జై కొడుతూ ఇల్లంతా తిప్పాల్సి ఉంటుంది.. ప్రతీ రౌండ్‌లో ఏ గ్యాంగ్ ఎంత ఎత్తులో చెప్పుని అతుక్కునేలా చేశారో గ్యాంగ్ లీడర్స్ అక్కడున్న బోర్డులో రాయాల్సి ఉంటుందని కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్ చెప్పాడు.

ఈ టాస్కులో కూడా రెడ్ టీమ్ అయినటువంటి మాధురి టీమ్ గెలిచింది. దీంతో మాధురిని కుర్చీలో కూర్చోబెట్టుకొని ఇల్లంతా తిప్పుతూ జేజేలు కొట్టింది సంజన టీమ్. దొంగల టాస్క్ లో ఏదైనా దొంగతనం చేయొచ్చు కానీ సంజన మాత్రం నీతిగా నిజాయితీగా ఆడాలంటూ సాకులు చెప్తుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో తనూజ, దివ్య , సుమన్ శెట్టి పర్ ఫెక్ట్ గేమ్ ఆడారు. వాళ్ళు దోచుకున్న డబ్బుని ఎవరి కంట పడకుండా కాపాడుకోగలిగారు. అలాగే వారి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఆడారు.