English | Telugu
Bigg Boss 9 Telugu : దొంగలుగా తనూజ, సుమన్ శెట్టి, దివ్య సూపర్ గేమ్.. ఊహించని ట్విస్ట్!
Updated : Oct 23, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం హౌస్ లో దొంగలు పడ్డారు. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఓ వింత టాస్క్ ఇచ్చాడు. వాంటెడ్ పేట అంటూ దానిలో గజదొంగలుగా సంజన, మధురి ఉన్నారంటూ బిగ్ బాస్ చెప్పాడు. రెడ్ టీమ్ లీడర్ గా మాధురి, బ్లూ టీమ్ లీడర్ గా సంజన ఉండగా.. వారి టీమ్ లలోని దొంగలు టాస్క్ టాస్క్ కి మారిపోతున్నారు. ఆ వివరాలు ఓసారి చూసేద్దాం..
నిన్నటి(బుధవారం) ఎపిసోడ్ లో .. మాస్ మాధురి-సంజన సైలెన్సర్ ఇద్దరు తమ గ్యాంగ్స్‌తో కలిసి హౌస్‌లో వీరంగం చేస్తున్నారు. అయితే తనూజ-సుమన్ శెట్టి కలిసి సంజన టీమ్ క్యాష్‌ని స్టోర్ రూమ్ నుంచి కొట్టేశారు. దీంతో సంజన టీమ్ హర్ట్ అయిపోయి మేము ఇక గేమ్ ఆడమనేసింది. ఇది చూసి మాధురి కూడా సపోర్ట్ చేసింది. కొట్టేసింది తనూజ-సుమన్-దివ్య కలిసి పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయం తెలిసి నిజంగానే డబ్బులు కొట్టేశారా అని తనూజని మాధురి వెళ్లి అడిగింది. కానీ తనూజ నాకేం సంబంధం లేదు నేను తీయలేదంటూ అబద్ధం చెప్పింది. దీనికి హర్ట్ అయి అలిగిన మాధురి కిచెన్‌లోకి వెళ్లింది. ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని తనూజ వస్తే మాధురి గట్టిగానే రియాక్ట్ అయింది. ఆపెయ్ తనూజ నాకు చిరాకు.. నన్ను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను.. నేను కొంతమందితో మాత్రమే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాను.. నాకు గేమ్ అవసరం లేదు.. నాకు మనుషులే ముఖ్యమంటూ రియాక్ట్ అయింది మాధురి. ఇంతలో రీతూ వచ్చి నీకు టీమ్ ముఖ్యం కాదా అంటూ తనూజపై ఫైర్ అరిచేసింది. అంటే టీమ్ బొక్క వాళ్ల దృష్టిలో అంటూ నోరు జారింది.
మాధురి తన టీమ్ కి సపోర్ట్ చేయడంతో ఆమెపై సంజన ఫుల్ ఫైర్ అయింది. దివ్య నువ్వు మా క్యాష్ తీశావా అని అడిగింది. నేను తీయలేదు నాకు గుర్తులేదు.. అంటూ దివ్య చెప్పడంతో సంజన కోప్పడింది. ఓకే రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం.. ఇదే పనిష్మెంట్ అంటూ సంజన అంది. దీంతో దివ్య కోప్పడింది. మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా.. అన్ ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిర్‌యే.. మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ ఉండదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో సంజన హర్ట్ అయింది. మరోవైపు తనూజ-సుమన్ శెట్టి కలిసి కొట్టేసిన క్యాష్ గురించి టీమ్ అంతా పట్టుబట్టడంతో మాధురి చివరికి ఒక డీల్ చేసింది. తనూజ వాళ్లు సంజన టీమ్‌కి చెందిన ఆరు వేల బీబీ క్యాష్ కొట్టేశారు. అందులో మూడు వేలు తనూజ-దివ్య-సుమన్ ఉంచేసుకొని మూడు వేలు మాత్రమే మాధురికి ఇచ్చారు. దాంతో పాటు గోలీసోడా టాస్క్ గెలిచినందుకు వచ్చిన రెండు వేల క్యాష్ కలుపుకొని మొత్తం ఐదువేలని టీమ్ మెంబర్స్‌కి పంచేసింది మాధురి. ఇక తన కోటాలో వచ్చిన ఆరు వేల క్యాష్‌ని దాచినట్లు మాధురి చెప్పింది. ఇప్పటికి ఈ టాస్క్ లో రెడ్ టీమ్ టాప్ లో ఉంది.