English | Telugu
Jayam serial : రుద్రని సూర్య కలుస్తాడా..అకాడమీలో పారుని చూసి అతను షాక్!
Updated : Oct 22, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -89 లో......రుద్ర ఎలక్షన్ లో పోటీ చెయ్యడం నాకు ఇష్టం లేదు.. మన కుటుంబం తరుపున వీరు ఎన్నికల్లో పోటీ చేస్తాడు.. ఆ విషయం పార్టీకి చెప్పండని శకుంతల అదేశిస్తుంది. తనకి ఇష్టం లేదన్నట్లు వీరు యాక్టింగ్ చేస్తాడు. మీరు అయిన అత్తయ్యకి చెప్పండి అని వీరు అంటాడు. ఇప్పుడు రుద్రకి లేని టెన్షన్ వద్దు.. ఎవరైతే ఏంటి మన కుటుంబం తరుపున ప్రజలకి మంచి జరిగితే చాలు అని పెద్దసారు అంటాడు.
మరొకవైపు పారు బాక్సింగ్ అకాడమీలో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తుంది. అక్కడ ఒకతను జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. మీరు మీ అకాడమీ కోసం నన్ను పిలిచారు కానీ నాకు నా రేంజ్ కి తగ్గ ఫెసిలిటీ ఇక్కడ లేదని అక్కడి వాళ్ళపై కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ రాత్రంతా నిద్ర లేచి తెల్లవారి లేచి పనిచేస్తూ కళ్ళు తిరిగినట్లు అయి కూర్చుంటుంది. అప్పుడే మక్కం ముసలివాడి వేషంలో వచ్చి గంగ మొహంపై నీళ్లు కొడతాడు. ఎవరు మీరని గంగ అడుగుతుంది. వీధిలోకి కొత్తగా వచ్చాను. ఆ తులసి చెట్టుకి రోజు నీళ్లు పోయండి.. మీ కష్టం తీరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. గంగ తులసి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ డబ్బు ఉండటం చూసి అది తీసుకుంటుంది. హమ్మయ్య సర్ ఇచ్చిన డబ్బు గంగకు అందాయని మక్కం దూరం నుండి చూసి అనుకుంటాడు.
మరొకవైపు స్నేహ రెడీ అయి రుద్ర వెళ్తుంటే తన దగ్గరికి వచ్చి నన్ను దార్లో ఉన్న అకాడమీ దగ్గర డ్రాప్ చెయ్యమని చెప్తుంది. అది వీరు విని తన మనుషులకి ఫోన్ చేసి రుద్రని ఫాలో అవ్వండి. ఒకవేళ సూర్య ని కలిస్తే సూర్య నిజం చెప్పే సిచువేషన్ ఉంటే అతన్ని చంపెయ్యాండి అని చెప్తాడు. నాకు ఫేవర్ గా ఉన్నంతవరకే ఏదైనా అని వీరు అంటాడు. తరువాయి భాగంలో స్నేహ వెళ్లే అకాడమీలో పారుని రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.