English | Telugu

కోటి రూపాయల లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న...బిగ్‌బాస్ బ్యూటీ

బుల్లితెర మీద ప్రియాంక జైన్ - శివ్ కుమార్ గురించి తెలియని వారు లేరు. మౌనరాగం సీరియల్ తో ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ ఆన్ స్క్రీన్ జంట ఆఫ్ స్క్రీన్ లో కూడా జంట కాబోతున్నారు. వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ కోసం ఒక కొత్త ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కోటి రూపాయల లోన్ తో ఈ ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ డ్రీం హోమ్ విత్ కోటి రూపాయల లోన్ అనే వీడియోని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నాం అని చెప్పుకొచ్చారు. "ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మా ఫ్యూచర్ హోమ్ ని కట్టుకుంటున్నాం.

ఇల్లంటే ఇటుకలు, దూలాలు, సిమెంట్ మాత్రమే కాదు మా ఆశలు, కలలతో నిర్మించుకుంటున్నాం. ఇది ఇంటిని నిర్మించడం కోసం ఉన్న స్థలం మాత్రమే కాదు జీవితకాల పునాది. మా జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది. ఇక్కడ జ్ఞాపకాలను దాచుకోవడానికి మా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాం. మన జీవితంలోని కొత్త అధ్యాయంలో మాతో కలిసి మీరు రండి. గణపతి బప్పా మోరియా" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు. ఇక వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని తెలిసి బుల్లితెర వాళ్లంతా విషెస్ చెప్తున్నారు. ఆరియానా, కాజల్ ఆర్జే, లాస్య మంజునాథ్, యాక్టర్ గౌతమ్ కృష్ణ అందరూ కాంగ్రతులషన్స్ చెప్తున్నారు.