English | Telugu
రమ్యకృష్ణని చూసి...సెట్ లో కింద పడి దొర్లిన జగపతిబాబు
Updated : Oct 23, 2025
జయమ్ము నిశ్చయమ్మురా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి రమ్యకృష్ణ వచ్చింది. ఇక ఆమెను చూసేసరికి ఒక రేంజ్ లో జగపతి బాబు ఫుల్ ఆన్ ఫైర్ తో వెల్కమ్ చెప్పారు. "వెల్కమ్ టు ఓజి రోజా ఆఫ్ ఇండియన్ సినిమా" అని చెప్పడం ఆమె వచ్చి జగ్గు భాయ్ డాన్స్ చేయడం జరిగిపోయాయి. "రమ్యకృష్ణ వచ్చేసింది వేడి పెరిగిపోయింది" అని చెప్పేసరికి ఆమె షాకయ్యింది. "ప్రపంచంలో ఎవరైనా ఫోన్ హలో అంటారు కానీ రమ్య కృష్ణ మాత్రం ఆ అంటుంది" అని చెప్పేసరికి ఆమె ఫుల్ గా నవ్వేసింది. "రమ్యకృష్ణ లాంటి హాట్ అమ్మాయి కార్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవడెక్కించుకోడు" అనేసరికి "నువ్వు చాలా బ్యూటిఫుల్ పర్సన్ వి హీరోయిన్స్ తో చాలా మర్యాదగా ఉంటావ్" అంటూ జగ్గు భాయ్ గురించి చెప్పింది రమ్య కృష్ణ.
"నీకు చిన్నప్పటి నుంచి సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం" అని అనేసరికి "నువ్వు కూడా కదా" అనేసింది రమ్యకృష్ణ. "రమ్య కృష్ణను ఎమ్బారస్ చేసే మగాడెవడన్నా ఉన్నాడా" అని అడిగి నేల మీద పడి దొర్లాడు జగ్గు భాయ్. దాంతో రమ్యకృష్ణ నిజంగా చాల ఎంబరాసింగ్ గా ఫీలయ్యింది. ఇక జగపతి బాబు, రమ్య కృష్ణ కలిసి ఆయనకు ఇద్దరు, ఖుషిఖుషిగా వంటి మూవీస్ లో కలిసి నటించారు. ఇక ఈ ప్రోమోలో ఎన్నో ఏళ్ళ స్నేహం వీళ్లిద్దరి మధ్య కనిపించింది. మరి రమ్య కృష్ణతో జగ్గు భాయ్ ఎం ముచ్చట్లు పెడతారో ఆదివారం ప్రసారమయ్యే షోలో చూడాలి.