English | Telugu
Bigg Boss 9 Telugu: సంజన వర్సెస్ తనూజ.. నీ యవ్వ తగ్గేదేలే!
Updated : Oct 22, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగానే తనూజ వైల్డ్ ఫైర్ అవతూ కన్పిస్తుంది. ఎంతలా అంటే ఎవరేమైనా తన గురించి మాట్లాడితే ఇచ్చిపడేస్తుంది.
నిన్నటి ఎపిసోడ్ లో మార్నింగ్ సాంగ్ అవ్వగానే.. సంజన, మాధురి మాట్లాడుకున్నారు. తనూజాను ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ నన్ను నామినేట్ చేశాడు. నిఖిల్ నాయర్ వచ్చాక కళ్యాణ్ ను తనూజ పట్టించుకోవట్లేదని సంజన అనగానే... అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాటలు వెనక్కి తీసుకోమంటూ మాధురి అంది. దాంతో మాధురి- కళ్యాణ్ ఇద్దరూ సంజనతో పర్సనల్ ఎటాక్ కి దిగారు. ఈ హౌస్ లో.. నా ఇమ్మాన్యుయేల్ నా అబ్బాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. నిన్ను వైల్డ్ కార్డ్స్ లో ఎవ్వరూ పట్టించుకోలేదు. పట్టించుకున్న ఇద్దరినీ మోసం చేశావంటూ ఇంకా గొడవను పెద్దది చేసింది సంజన.
కాసేపటిక సంజన దగ్గరికి తనూజ వెళ్ళింది. సంజన గల్రానీ గారూ ఒక స్టేట్ మెంట్ పాస్ చేసేముందు ఆలోచించాలి. ఇదే గల్రానీ ఆ హౌస్ లో కూర్చుని నాకు పెళ్లయ్యింది, పిల్లలు పుట్టారు కాబట్టి మాట్లాడట్లేదు అన్నది. నాకు నాన్న లేరు కదా అని సంజన సమాధానం చెప్పగా, నాకు అమ్మ లేదు కదా... మీరు నా దగ్గరకు వచ్చారా, నేను మీ దగ్గరకు వచ్చానా అంటూ నిఖిల్ ను మొహం మీదే అడిగేసింది తనూజ. మైండ్ యువర్ వర్డ్స్... మీకు కళ్యాణ్ తో పాయింట్ ఉంటే అతనితో మాట్లాడండి. నా పేరు ఎందుకు వస్తోంది. ప్రతిదానికి వాడొచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు. నేను వెళ్తున్నానని అంటారు. ఇది నా క్యారెక్టర్ ని తక్కువ చేసినట్టుగా ఉంది.. అనవసరంగా బయటకు వెళ్లిన ఆమెను తెచ్చి నెత్తిన పెట్టుకున్నామంటూ తనూజ ఎమోషనల్ అయ్యింది. నేను ఇమ్మాన్యుయల్ ను బయటకు పంపలేదు నీలాగా.. నీవల్లే భరణి బయటకు వెళ్ళాడు. నువ్వేం నాకోసం త్యాగం చేయలేదు. కాఫీ గటగటా తాగేశావని సంజన అంది. రీతూ హెయిర్ కట్ చేసుకుంది. తనకి నా సెల్యూట్ అని సంజన అనగానే అయితే రోజు చేయండి సెల్యూట్ అని తనూజ అంది. నామినేషన్ తర్వాత వీరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.