English | Telugu

Bigg Boss 9 Telugu: దొంగతనం కరెక్టే.. సంజనకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాధురి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం కంటెస్టెంట్స్ కి దొంగల టాస్క్ ఇచ్చాడు. ఇందులో సుమన్ శెట్టి, తనూజ, దివ్య తమ స్ట్రాటజీతో దూసుకెళ్తున్నారు. ఇక ఈ టాస్క్ లలో రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ సాగుతోంది.

ఇక ఒక టాస్క్ అయ్యాక మాధురి టీమ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి సంజన వస్తుంది. ఇలా అలిగి ఆటలాడితే ఎలా అంటూ అడిగింది. అలగమని ఎవరూ చెప్పలేదు సంజన అని మాధురి అంది. లేదండీ బాధగా ఉంటుంది కదా అని సంజన అనగానే.. ఎందుకు బాధగా ఉండదు మా దగ్గర డబ్బులు తక్కువ వచ్చినోళ్లకి బాధగా ఉండదా అంటూ మాధురి అంది. రెండు వారాల ఇమ్యూనిటీ అంటే మాటలు కాదు.. అది కూడా నేను ఏడవ వారంలో ఉన్నానమ్మా అని సంజన అంది. ఏడవ వారంలో ఉన్న నీకే ఇలా ఉంటే ఫస్ట్ వీక్‌లోనే నామినేషన్‌లో ఉన్న వాళ్లకి ఎలా ఉంటుంది.. మేము ప్రాణం పెట్టి ఆడాలని వాళ్లకి ఉంటుంది కదా అంటూ మాధురి చెప్పింది. ప్రాణం పెట్టి ఆడండి కానీ వేరే వాళ్ల ప్రాణం పీకి ఆడకూడదు కదా అంటూ సంజన చెప్పింది. ఇక వాష్ రూమ్ దగ్గరికి వచ్చి ఇమ్మూతో సంజన ఇదే డిస్కస్ చేసింది. నిన్న నెట్టేద్దాం కళ్యాణ్‌కి అని చెప్పి ముగ్గురు అబ్బాయిలు చెప్పారు నాతో.. నేను లేదురా అది మన క్లాస్ కాదు.. ఇక్కడ వాళ్లు ఒక పది మంది వస్తారు. మనం పది మంది పోతాం.. బాహుబలి క్లైమాక్స్‌లా గీక్కుద్దాం ఒకరినొకరు.. అది మన స్టాండర్డ్‌ యే కాదురా.. బయట ఆర్టిస్టులం.. ఆవేశంలో డెసిషన్ తీసుకోవద్దు.. ఒక్క గుడ్డు దొంగతనంతో ఇది ఎలా కంపేర్ చేస్తారు.. టూ వీక్స్ ఇమ్యూనిటీ పోతుంది ఇమ్మూ.. అంటూ సంజన అంది. అయితే ఆ సమయంలో దివ్య అక్కడ ఉంది. దీంతో ఈ విషయం బయటికెళ్లి మాధురి వాళ్లతో చెప్పింది దివ్య. ఇక దివ్య ఈ విషయం చెప్పగానే మాధురి ఫైర్ అయింది. ఈ ఎక్స్‌ట్రాలు తగ్గించుకోమని చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది.. ఏ క్లాస్ ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ అంటూ మాధురితో పాటు కళ్యాణ్ కూడా సంజనపై ఫైర్ అయ్యాడు.

పోనిలే అని సాయి అంటుంటే ఇది ఫస్ట్ టైమ్ కాదు సాయి.. ఈ క్లాస్ ఏంటి.. అంతకుముందు కూడా చాలా సార్లు అంది అంటూ కళ్యాణ్ అన్నాడు. ఈవిడ నోరు జారి మాట్లాడతదో తెలిసి తెలియక మట్లాడతదోనని మాధురి అంది. ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి అన్నీ కొట్టేసి ఇప్పుడు క్లాస్ అంటే ఎవడూ నమ్మడు అంటూ కళ్యాణ్ అన్నాడు. కాసేపటి తర్వాత ఇద్దరు గ్యాంగ్ లీడర్లకి రెండు షాపులు ఇచ్చాడు బిగ్‌బాస్. మాధురి ఏమో టీ స్టాల్ తీసుకుంటే సంజన పానీపూరి షాప్ తీసుకుంది. ఈ షాపుల ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు.. అలానే మెంబర్లని గ్యాంగ్ మార్చుకునేందుకు మంతనాలు చేసుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఇంతలో మా డబ్బులు కొట్టేశారు.. ఇది కరెక్ట్ కాదు కదా బిగ్‌బాస్ అని సంజన చెప్పింది. అది మీ గ్యాంగ్స్ మధ్య ఇష్యూ కనుక మీరే చూసుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో కొట్టేయడం కరెక్టే అంటూ మాధురి టీమ్ గెంతులేసింది. ఇక సంజన డిస్సప్పాయింట్ అయింది.