English | Telugu
షూటింగ్ టైమ్ లో అమ్మాయిలకు పీరియడ్స్ వస్తే.. ఈషా రెబ్బా బోల్డ్ స్టేట్ మెంట్!
Updated : May 25, 2024
పీరియడ్స్ అంటేనే ఎదిగిన ప్రతీ ఆడపిల్లకి నరకంగా ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎదురయ్యే సిచువేషన్ ని ఎవరితో షేర్ చేసుకోలేరు. కానీ అలాంటిది షూటింగ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ కి పీరియడ్స్ వస్తే ఎలా అని.. దానిని నేను ఫేజ్ చేశానంటు ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలని పంచుకుంది ఈషా రెబ్బా. షూటింగ్ టైమ్ లో పీరియడ్స్ వస్తే.. ఇతర కంపెనీలు, వర్క్ ప్లేస్‌ల మాదిరిగా లీవ్ పెట్టి వెళ్లిపోవడానికి ఉండదు. ఎందుకంటే షూటింగ్ టైమింగ్, బోలెడంత ఖర్చు, ఆర్టిస్ట్‌లతో కాంబినేషన్ డేట్స్, ఒక గంట ఆలస్యం చేసిన కూడా లక్షల్లో ఖర్చు వృధా అవుతుంది. రిస్క్ తీసుకోరు. కాబట్టి పీరియడ్స్ టైమ్ లో షూటింగ్లో పాల్గొనాల్సింది. నొప్పి ఎక్కువగా వస్తే పెయిన్ కిల్లర్స్ తీసుకుని మరీ షూటింగ్‌కి వెళ్లేవాళ్లం. నా ఫస్ట్ మూవీ అంతకు ముందు ఆ తరువాత చేసినప్పుడు.. సెంటిమెంట్ సీన్ తీస్తున్నారు. అప్పుడు నాకు పీరియడ్స్ వచ్చింది. ఆ విషయం నేను డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి చెప్పాను. ఆయన అర్ధం చేసుకున్నారు.. రెస్ట్ తీసుకోమన్నారు. కానీ అక్కడ రోజంతా రెస్ట్ తీసుకుంటే.. షూటింగ్ మొత్తం డిస్ట్రబ్ అవుతుంది. చాలామంది డైరెక్టర్లకి పీరియడ్స్ అని చెప్తే అర్ధం చేసుకుంటారు. కాస్త కోలుకోవడానికి టైమ్ ఇస్తారు. అమ్మాయిలకు ఎవరితో ఇలాంటి విషయాలు మాట్లాడొచ్చే అనే వైబ్ తెలుస్తుంది. అలా కొంతమందితో షేర్ చేసుకుంటాం. నా వరకూ.. పీరియడ్స్ అంటే మాట్లాడకూడని టాపిక్ కాదు అని అనుకుంటా. చిన్నప్పటి నుంచి మనకి పీరియడ్స్ అంటే ఏదో వినకూడదని విషయం అన్నట్టుగా చేస్తుంటారు.
ఈ పీరియడ్స్ గురించి నా వరకూ నేను అవగాహన కల్పిస్తూ ఉంటా. బిగ్ బాస్‌కి కూడా వెళ్లి నేను అదే చెప్పాను. పీరియడ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడాలి.. మేల్ ఫ్రెండ్స్‌తో కూడా డిస్కస్ చేయాలి.. ఇప్పుడు చాలా వరకూ మార్పు వచ్చింది. మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పరంగా చూస్తే.. పీరియడ్స్ వచ్చినప్పుడు గంటలు గంటలు నిలబడి ఉండాలి.. ఓ వైపు పెయిన్ వస్తుంటుంది. వర్క్‌పై దృష్టి పెట్టలేం. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొదటి మూడు రోజులు పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్టింగ్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు.మెంటల్‌గా ఫిజికల్‌గా ఆ సీన్‌తో కనెక్ట్ అవ్వాలి. లోలోపల బాధని అనుభవిస్తూ.. నవ్వుతూ ఉండే సీన్ చేయాలంటే అది పెద్ద టాస్క్. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో నొప్పిని భరిస్తూ యాక్ట్ చేయడం అంటే పెద్ద టఫ్ టాస్క్. పీరియడ్స్ వచ్చింది కదా.. షూటింగ్‌కి ప్యాకప్ అంటే కుదరదు. డేట్ వస్తుందంటే మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి.. ఒక వారం ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఆ డేట్స్‌లో కనుక మనకి షూటింగ్ డేట్స్ వస్తే కాస్త ప్రాబ్లమ్ అవుతుంటుందంటు ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.