English | Telugu
టీఆర్పీలో కార్తీకదీపం-2 ని బీట్ చేసిన బ్రహ్మముడి!
Updated : May 24, 2024
బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను కొత్తగా మొదలైన కార్తీకదీపం-2 కి ఫ్యాన్ బేస్ అంతగా రాలేదనే చెప్పాలి. ఈ వారం టీఆర్పీలో అగ్రస్థానంలో 'బ్రహ్మముడి' నిలిచింది. రెండవ స్థానంలో 'కార్తీకదీపం-2', మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' ఉండగా.. నాల్గవ స్థానంలో ' గుండె నిండా గుడిగంటలు' ఉంది. ఆ తర్వాత అయిదవ స్థానంలో కొత్త సీరియల్ ' నువ్వు నేను ప్రేమ' ఉంది.
గత కొన్ని నెలలుగా స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. దీనికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఆన్ స్క్రీన్ పై రాజ్-కావ్యల మధ్య బాండింగ్ ఉంది. అలాగే దుగ్గిరాల ఇంట్లో సాగే ఎమోషనల్ సీక్వెన్స్ సీన్స్, అక్కచెల్లెళ్ళ మధ్య సాగే గొడవలు.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. కనకం, కృష్ణమూర్తిల మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్.. తెలుగింటి ప్రేక్షకులకు దగ్గరగా ఉంది. బొమ్మలకి రంగులు వేసుకుంటూ కృష్ణమూర్తి కనకం ఇద్దరు తమ ఇద్దరు కూతుళ్ళు కావ్య, స్వప్నలని చదివించి దుగ్గిరాల ఇంటి కోడళ్ళుగా చేశారు. కావ్యని దుగ్గిరాల ఇంట్లో మొదట అందరు ద్వేషించేచారు. ఇక కొన్ని ఎపిసోడ్ ల ముందు వరకు కావ్యని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవీ, సీతారామయ్య, సుభాష్, కళ్యాణ్ లు ఇష్టపడగా.. అనామిక ఇంట్లోకి వచ్చాక ధాన్యలక్ష్మి మనసు పూర్తిగా మారిపోయింది. ఇక అనామిక ఏం చెప్పిన చేస్తున్న ధాన్యలక్ష్మి..నిత్యం తిట్లు తింటూనే ఉంది. ఇక గత కొన్ని ఎపిసోడ్ ల ముందు నుండి రాజ్ తీసుకొచ్చిన బాబు గురించి దుగ్గిరాల ఇంట్లో అందరి మధ్య కలహాలు మొదలైయ్యాయి.
ఇక సుభాష్ కొడుకే రాజ్ తీసుకొచ్చిన బాబు అని తెలుసుకున్న కావ్య..అసలు నిజమైన తల్లి అయితే పిల్లాడిని ఇలా వదిలి ఇన్ని రోజుల ఉండదని, డబ్బుల కోసం ఇలా చేస్తుందని తన అడ్రెస్ కనుక్కొని వెళ్తుంది కావ్య. అక్కడ మాయాని బెదిరించి ఇంటికి తీసుకొని రాగా.. తను నిజమైన మాయా కాదని రుద్రాణి చెప్పినట్టు తను నటించిందని కావ్యకి తెలుస్తుంది. మరి రుద్రాణి ప్లాన్ ని కనిపెట్టిన కావ్య అసలు నిజాన్ని దుగ్గిరాల ఇంట్లో వారికి నిరూపించగలదా లేదా తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.