English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్త కుట్రలు తెలుసుకున్న కోడలు.. ఇంటి పెత్తనం ఎందుకు తీసుకుందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -121 లో.....రామలక్ష్మి నిద్ర లేచి తను తిరిగి మనసు మార్చుకొని వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది. అభి తనని కిడ్నప్ చేసినప్పుడు.. శ్రీలత, అభి ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు అవి.. సీతాకాంత్ జీవితంలో పెళ్లి చేసుకోకూడదన్న సవతి తల్లి మాటలు విన్న రామలక్ష్మి షాక్ అవుతుంది. ఎలాగైనా సీతాకాంత్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్న సంఘటన గుర్తుకు చేసుకుంటుంది.

సీతాకాంత్ నిద్ర లేస్తాడు. రామలక్ష్మి కనిపించకపోయేసరికి సీతాకాంత్ టెన్షన్ పడతాడుమ అప్పుడే రామలక్ష్మి పూజాచేస్తూ పాట పాడుతుంది. దాంతో అందరూ హాల్లోకి వస్తారు. ఈవిడెంటి ఇలా అయిపోయిందని శ్రీవల్లి పనిమనిషి తో అంటుంది. మీకు ఒకటి అర్ధం కావడం లేదు. ఆవిడ ఇంటికి పెద్ద కోడలిగా డ్యూటీ ఎక్కారని పనిమనిషి అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. అందరికి హారతి ఇస్తుంది. గుడ్ మార్కింగ్ అత్తయ్య అంటు స్పెషల్ గా శ్రీలతకి చెప్తుంది రామలక్ష్మి. నీ హెల్త్ ఎలా ఉందని సీతాకాంత్ అడుగగా.. మొన్న నాకు ఒక మాటిచ్చారు కదా ఎప్పుడు నాకు ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటానని మీరు ఉండగా నాకేం కాదు.. మీరు వెళ్లి స్నానం చేసి రండి అని సీతాకాంత్ తో రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ పై శ్రీలత ఎంత కుట్రలు చేస్తుందో తెలుసుకున్న రామలక్ష్మి తనతో మాట్లాడుతుంది. అత్తయ్య ఇక మీరు కృష్ణా, రామా అంటూ ఒక మూలాన కూర్చుండి.. ఇంటి బాధ్యతలు మొత్తం నాకు అప్పజెప్పారు కదా.. నేను చూసుకుంటానని రామలక్ష్మి అనగానే శ్రీలత, సందీప్, శ్రీవల్లి ముగ్గురు షాక్ అవుతారు.

రామలక్ష్మి గదిలోకి వెళ్లేసరికి సీతాకాంత్ రెడీ అవుతాడు. ఎక్కడికి అని అడుగగా నిన్ను తీసుకొని స్వామి గుడికి రమ్మని చెప్పాడు.. పదా వెళ్దామని సీతాకాంత్ అంటాడు. అయిన ఒక విషయం చెప్పు మనసు మార్చుకొని వచ్చి ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగగా.. అప్పుడే పెద్దాయన వస్తాడు. మరొకవైపు ఏంటి ఈ రామలక్ష్మి ఇలా మాట్లాడుతుందని శ్రీలత, సందీప్ ఇద్దరు అనుకుంటారు.అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు గుడికి వెళ్తుంటారు. రామలక్ష్మి ఎందుకని శ్రీలత అడుగుతుంది. నాకేం పర్లేదు నా గురించి టెన్షన్ పడకండి అని రామలక్ష్మి సెటైర్ వేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్తు.. శ్రీవల్లిని వంట చెయ్యమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.