English | Telugu
గోవా బీచ్‌లో సూర్యుడు.. పోగేసుకుంటున్న లాస్య!
Updated : Jun 13, 2024
ఒకప్పుడు బుల్లితెర మీద యాంకర్ గా వ్యవహరించిన లాస్య గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. ఒక మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ రవితో పాటు సహా యాంకర్ గా పని ఛేల్సింది. ఏనుగు - చీమ కథలతో లాస్య అప్పట్లో ఫుల్ ఫేమస్ కూడా. అలాంటి లాస్య పెళ్లి, పిల్లలు అంటూ ఫామిలీ లైఫ్ తో బిజీ ఐపోయి యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా గోవా వెళ్ళింది తన బాబుని తీసుకుని. అక్కడ ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకుంది. వెళ్లి గోవా బీచ్ లో తన బాబుతో తడి ఇసుకలో కూర్చుని సూర్యుడి బొమ్మ వేసి కళ్ళజోడు పెట్టి ఫన్నీగా అల్లరి చేస్తూ కనిపించింది.
ఇప్పుడు ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చిన్ని చిన్ని అందాలు...మేకింగ్ మెమోరీస్" అంటూ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే లాస్య అల్లరికి ఫిదా ఐపోతున్నారు. ఇద్దరూ చాలా క్యూట్ గా అల్లరి చేస్తున్నారు అని మెసేజెస్ పెడుతున్నారు. లాస్య బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ని ఇచ్చింది. ఇక లాస్య బుల్లితెర మీద వచ్చే అన్ని ఈవెంట్స్ కి తన భర్త మంజునాధ్ ని కూడా వెంటబెట్టుకుని వస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఛానెల్ లో కూడా ఎన్నో వీడియోస్ చేస్తోంది లాస్య.