English | Telugu

వాడు పడుచు వాడు కాదు... ముసలి వాడు 


జబర్దస్త్ ని శుక్ర, శనివారాలకు మార్చడంతో వీకెండ్స్ లో కామెడీ స్కిట్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. "సరదా శుక్రవారం వెర్సెస్ సరిపోదా శనివారం" పేరుతో అలరిస్తోంది. ఇందులో స్కిట్స్ డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాకెట్ రాఘవ స్కిట్ మంచి కలర్ ఫుల్ గా ఉండబోతోంది. రాకెట్ రాఘవ స్కిట్స్ అంటే అందులో కామెడీ మినిమం గ్యారంటీ అని చెప్పొచ్చు.

ఈ వారం షోలో రాఘవ మంచి అదిరిపోయే స్కిట్ తో వచ్చేసాడు. ఇక సోగ్గాడు రాఘవ కోసం ఒక అమ్మాయి తపించిపోతూ పెళ్లి చేసుకోమంటూ వచ్చి అడిగేసరికి "ఇలా వెంటపడిన వారందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతే రష్మీ నుంచి రష్మిక మందాన వరకు అందరూ పెళ్లి చేసుకోమని అడుగుతారు" అంటూ పంచ్ డైలాగ్ వేసాడు. ఆ అమ్మాయి బాధ చూడలేక మరో కమెడియన్ రాఘవను పెళ్లి చేసుకుంటే ఏడవాల్సిందే అంటూ డైలాగ్ వేసేసరికి రాఘవా షాకయ్యాడు.

అతనేమీ పడుచు వాడు కాదు...ముసలి వాడు అని చెప్పాడు ఆ కమెడియన్. దాంతో రాఘవ ముసలివాడు అని అర్ధం వచ్చేలా "తాతయ్య తాతయ్య హో" అనే సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో వేశారు. ఇలా ఈ వారం షో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. అలాగే ఈ జబర్దస్త్ కి గెస్ట్ గా చాందిని చౌదరి వచ్చి స్కిట్స్ అన్నీ చూసి కడుపుబ్బా నవ్వుకుంది. చాందిని చౌదరి ఇటీవలి కాలంలో పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.