English | Telugu

షణ్ముఖ్ జస్వంత్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!


ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయంటే ఏంటో అనుకున్నా కానీ ఇది నిజమే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోయారు. ఇక కెరీర్ అయిపోయిందనుకుంటే మళ్ళీ పడి లేచిన కెరటంలా వచ్చేశాడు యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్. వైవా వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిన జస్వంత్.. ఎన్నో వెబ్ సిరీస్ లు చేశాడు.

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ గురించి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. సిరితో అతి చేష్టల‌ కార‌ణంగా విన్న‌ర్ కావాల్సిన అతను ర‌న్న‌ర్ గా మిగిలిపోయాడు. సిరి త‌ల్లి, ష‌న్ను త‌ల్లి చెప్పిన అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా సిరితో ష‌న్ను చేసిన అతి కార‌ణంగానే త‌నపై నెగిటివిటి పెరిగిపోయింది. అది తెలిసి కూడా ష‌న్నులో మార్పు రాక‌పోవ‌డంతో నెటిజ‌న్స్ ఓ రేంజ్ లో ష‌న్నుని, సిరిని ఆడేసుకున్నారు. దారుణంగా కామెంట్ లు చేశారు. వీరి ఎపిసోడ్ కార‌ణంగానే షన్నుతో దీప్తి సునైన త‌న ల‌వ్ కి బ్రేకప్ చేప్పేసి షాకిచ్చింది. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ వెబ్ సిరీస్ లు చేసుకుంటున్నాడు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్. ఇక ఇప్పుడు మరో సిరీస్ కి సిద్ధమయ్యాడు. అదే ' లీలా ' వెబ్ సిరీస్. ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యకార్యక్రమాలు మంగళవారం నాడు ఫిల్మ్ నగర్‌లో జరిగాయి. #90s' వెబ్‌ సిరీస్‌‌తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఈటీవీ విన్‌ లో ఈ 'లీలా' వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. తన కొత్త వెబ్ సిరీస్‌ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, ప్రవీణ్ కాండ్రేగుల, దర్శకుడు సుబ్బు తదితరులకు ధన్యవాదాలను తెలియజేశాడు.