English | Telugu

Intinti Ramayanam : ఇంటింటి రామాయణం సీరియల్ మొదటి ఎపిసోడ్ ఎలా ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో తాజాగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది. ఇక అదే స్థానంలో వచ్చిన ' ఇంటింటి రామాయణం' హిట్టా‌‌.. ఫ్లాపా.. ఓ సారి చూసేద్దాం.

సకల శుభాలకు ఆదిదేవుడవు నువ్వు.. నా కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడు స్వామీ అంటూ అవని పాత్ర పరిచయం అవుతుంది. ఇక అవని వాకిట్లో ముగ్గు వేస్తుండగా తన ముద్దుల కూతురు ఆరాధ్య వచ్చి.. వాకిట్లో ముగ్గు ఎందుకు వేస్తారో.. దాని వల్ల ఉపయోగం ఏంటో అడిగి తెలుసుకుంటుంది. ఇక అవని అత్త మామలిద్దరూ కోడలు ఇచ్చే కాఫీ కోసం కొట్టు మిట్టాడుతుంటారు. ఇంతలో అవనీ.. అత్తయ్యా మీ కాఫీ రెడీ అంటూ కాఫీ పట్టుకుని వచ్చేస్తుంది. నీ చేతిలో ఏమాయ ఉందో ఏమో కానీ.. నీ చేతి కాఫీ తాగకపోతే నా మెదడు పనిచేయదని అత్త అంటుంది. అమ్మా అవని.. ఈ రోజు మార్కెట్ యాడ్‌లో టెండర్ ఉంది.. మీ వారిని త్వరగా రెడీ అవ్వమని చెప్పమని వాళ్ళ మామ అవనితో అంటాడు. దాంతో సరేనని తన భర్త అక్షయ్ దగ్గరకు వెళ్తుంది అవని. గుడ్ మార్నింగ్ శ్రీవారూ అని అవని ప్రేమగా పలకరిస్తుంది. లక్షమందిలో ఒక్కడిగా కాకుండా పది మందిలో ఒక్కడిగా ఉండాలని తాపత్రయ పడే బిజినెస్‌‌మెన్‌గా అక్షయ్ కనిపిస్తాడు. ఇక ఇంట్లో ఉన్న ముసలి అమ్మమ్మ స్వీట్లు కోసం దొంగతనం చేస్తుంటే.. అవనికి అడ్డంగా దొరికిపోతుంది. ఇంతలో చిన్న మరిది వచ్చి.. ఎందుకు నానమ్మా.. వదిన నిన్ను స్వీట్లు తిననీయడం లేదని దొంగతనం చేసి దొరికిపోయావ్ కదా అని ఆటపట్టిస్తాడు. ఇక చిన్న మరిది శ్రీకర్ లాయర్ కావడంతో.. బార్ అసోసియేషన్ ఎన్నికల హడావిడిలో ఉంటాడు. మరిదికి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తుంది అవని.

ఇక అక్షయ్, కమల్ ఇద్దరు
టెండర్ కి వెళ్తుంటే దారిలో రౌడీలు కాపు కాసి కొడతారు. వాళ్ళని పంపించింది చక్రధర్. ఇక ఎలాగోలా రౌడీలని కొట్టేసి టెండర్ ప్లేస్ కి వెళ్తారు. ఆ తర్వాత అతి తక్కువ బడ్జెట్ అండ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అక్షయ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకే టెండర్ అని గవర్నమెంట్ చెప్తుంది. ఇక చక్రధర్ మొహం ఎత్తుకోలేక వెళ్ళిపోతాడు. అక్షయ్, కమల్ ఇంటికెళ్ళి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పగా అందరు చక్రధర్ మీద ఫుల్ సీరియస్ గా ఉంటారు. రోజు రోజుకి వాడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయ్.. వాడు నా చెల్లెలి భర్త కాకుండా ఉంటే ఏనాడో వాడి అంతు చూసేవాడ్ని.. ఏదొకటి చేయాల్సిందే అని అంటాడు అక్షయ్ తండ్రి. ఇంతలో అక్షయ్ మొదటి తమ్ముడు కోర్టునుంచి వచ్చి.. మనం ఇలా ఊరుకుంటే వాడు ఇలా రెచ్చిపోతూనే ఉంటాడు.. వెంటనే కేసు పెట్టి లోపల వేయిస్తానని ఆవేశంగా వెళ్తుంటాడు. అడ్డుపడ్డ అవని.. అతను మీ మామయ్య.. అతనిపై కక్ష తీర్చుకుంటే మీ అత్తయ్యని శిక్షించినట్టే. మీ నాన్న గారి గురించైనా ఆలోచించండి.. మన రెండు కుటుంబాలు విడిపోయినందుకు మీ నాన్న గారు బాధపడని రోజు లేదు. కూతురికి దూరమై బామ్మ గారూ కూడా బాధపడుతున్నారని అవని వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. మరోవైపు పబ్ లో పల్లవి పాత్ర పరిచయం అవుతుంది. గెలవడం నా హాబీ.. ఏం చేసైనా గెలుస్తా.. గెలవకపోతే నేను చక్రధర్ కూతుర్నే కాదని తన ఫ్రెండ్ తో పల్లవి అంటుంది. మొత్తానికి ఈ ఇంటి రామాయణం ఇలా ఉంది. మీరు చూస్తే మీకెలా అన్పించిందో కామెంట్ చేయండి.