English | Telugu
"రామయ్యా వస్తావయ్యా" చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫిల్మ్ సిటీలోని ఫ్లెక్స్ హౌస్ లో జరుగుతుంది.
"అరుంధతి" చిత్రంతో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఎక్కువ అయ్యాయి. అయితే అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "వర్ణ". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో అనుష్క మాట్లాడుతూ...
ప్రముఖ హీరోయిన్ కావ్య మాధవన్ త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది కూడా ఒక ప్రముఖ కెమెరామన్ అయిన సంజయ్ మీనన్ తో తన వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కావ్య ఇదివరకే పలుసార్లు ఉత్తమ నటిగా అవార్డులు దక్కించుకుంది.
"అమ్మో... బాపుగారి బొమ్మో.." అంటూ అందరి చేత అనిపించుకున్న ప్రణీత మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.
దక్షిణాది శృంగార తారగా అభిమానులను తన అందచందాలతో ఒక ఊపు ఊపిన షకీలా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే గత కొద్దికాలంగా షకీలా సైలెంట్ అయిపొయింది. దీనికి కారణం ప్రస్తుతం షకీలా తన ఆత్మకథ రాస్తుందట.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్ర మొదటి టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8:09ల సమయంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోలో జరిగాయి.
"అత్తారింటికి దారేది" వంటి ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రం తర్వాత మళ్ళీ పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో "కోబలి" అనే చిత్రం రానుంది. అయితే ఈ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి నిర్మించనున్నారు. మరి ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా లేక మరే ఇతర దర్శకుడైన తెరకేక్కిస్తాడా అనే సంగతి త్వరలోనే తెలియనున్నాయి.
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా "బసంతి" అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మహేష్ లో ఉన్న ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం "అతడు". ఈ చిత్రంలో మహేష్ సైలెంట్ గా ఉండటం, బుల్లెట్ లాగా ఉండే అతని మాట తీరుతో టాప్ స్థానంలోకి చేరుకున్నాడు మహేష్ .
"సీమ టపాకాయ్" చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణకి, తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేకపోయాయి. అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగులో మరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. సుధీర్ హీరోగా "మాయదారి మల్లిగాడు" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది.
"నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది" అంటూ తన తిక్కతో "గబ్బర్ సింగ్" చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్టయ్యేలా చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.
"లీడర్" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రిచాగంగోపాధ్యాయ త్వరలోనే సినిమాలకు స్వస్తి చెప్పనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధంగా వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తనే మీడియా ద్వారా తెలిపింది.
"సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు" తర్వాత మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అన్నీ రికార్డులను బ్రేక్ చేస్తూ "అత్తారింటికి దారేది" సినిమా అరుదైన ఘనత సాధించింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన "మగధీర" చిత్రం అత్యధిక కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టిస్తే...