English | Telugu

తారక్ తో చిందులేయనున్న బాపుగారి బొమ్మ

"అమ్మో... బాపుగారి బొమ్మో.." అంటూ అందరి చేత అనిపించుకున్న ప్రణీత మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కోసం తెగ ప్రయత్నాలు చేసిన దర్శకుడు మాత్రం చివరకు ప్రణీతను మరో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. సమంత, ప్రణీతలు కలిసి నటించడం ఇది రెండవసారి. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఎన్టీఆర్ కొత్తగా కనిపించబోతున్నాడు.