English | Telugu

గుమ్మడికాయ దొంగలు దొరుకుతార...?

దక్షిణాది శృంగార తారగా అభిమానులను తన అందచందాలతో ఒక ఊపు ఊపిన షకీలా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే గత కొద్దికాలంగా షకీలా సైలెంట్ అయిపొయింది. దీనికి కారణం ప్రస్తుతం షకీలా తన ఆత్మకథ రాస్తుందట. ఇందులో తన వ్యక్తిగత, వృత్తిపరంగా తను ఎదుర్కొన్న తీపి, చేదు అనుభవాలను పూర్తిగా తెలియజేయబోతున్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సినీ పరిశ్రమ పెద్దవాళ్ళు "గుమ్మడికాయ దొంగల్లాగా" భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ ఆ ఆత్మకథలో తమ గురించి చెపుతుందోనని భయపడిపోతున్నారు. ఈ ఆత్మకథ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది.