English | Telugu

ఒకే ఒక్క టీజర్.. రికార్డ్ బ్రేక్ అంతే..!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్ర మొదటి టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే కేవలం ఈ చిత్ర వర్కింగ్ సన్నివేశాలతో మాత్రమే విడుదలైన ఈ టీజర్ కు అశేష స్పందన వస్తుంది.ఈ టీజర్ విడుదలయిన ఒకటిన్నర రోజులోనే యూట్యూబ్ లో 5,92,096 మంది వీక్షించారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" సినిమా టీజర్ ను ఒకటిన్నర రోజులో 4,68,564 మంది వీక్షించారు. అంటే ఇప్పటి వరకున్న పవన్ రికార్డును ప్రభాస్ బద్దలుకొట్టినట్లే కదా. మరి ఈ సినిమా విడుదలై మరో ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేస్తుందని అనడంలో ఎలాంటి సంకోచం లేదని సినీ వర్గాలు చెప్తున్నాయి.