English | Telugu
జోరుమీదున్న యంగ్ టైగర్
Updated : Oct 29, 2013
"రామయ్యా వస్తావయ్యా" చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫిల్మ్ సిటీలోని ఫ్లెక్స్ హౌస్ లో జరుగుతుంది. ప్రస్తుతం రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి "రభస", "జోరు" అనే టైటిల్ లు పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.