English | Telugu

కెమెరామన్ ను పెళ్లి చేసుకోనున్న హీరోయిన్...?

ప్రముఖ హీరోయిన్ కావ్య మాధవన్ త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది కూడా ఒక ప్రముఖ కెమెరామన్ అయిన సంజయ్ మీనన్ తో తన వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కావ్య ఇదివరకే పలుసార్లు ఉత్తమ నటిగా అవార్డులు దక్కించుకుంది. మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే సంవత్సరం క్రితమే తనకు నిశాల్ చంద్రతో వివాహం జరిగింది. కానీ అదే సంవత్సరంలో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని, విడిపోయారు. మరి కావ్య తన రెండో వివాహం వస్తున్న ఇలాంటి వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.