English | Telugu
పవన్ గురించి త్రివిక్రమ్ చెప్పిన టాప్ సీక్రెట్
Updated : Oct 24, 2013
మహేష్ లో ఉన్న ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం "అతడు". ఈ చిత్రంలో మహేష్ సైలెంట్ గా ఉండటం, బుల్లెట్ లాగా ఉండే అతని మాట తీరుతో టాప్ స్థానంలోకి చేరుకున్నాడు మహేష్ . అయితే ఈ చిత్రనికి దర్శకత్వం వహించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా గురించి ఓ పెద్ద సీక్రెట్ ను భయటపెట్టాడు.
త్రివిక్రమ్ ఎప్పుడు కథ చెప్పినా కూడా తనకు నిద్ర వస్తుంది అని ఈ మధ్యే పవన్ కళ్యాణ్ అందరి ముందు ఓ వేడుకలో తెలియజేశాడు. అయితే పవన్ కు మొదట్లో త్రివిక్రమ్ ఓ కథ చెప్పారంట. ఆ కథ వింటే పవన్ కి నిద్ర వచ్చేసిందట. ఇంతకి పవన్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ ఏంటో తెలుసా...? మహేష్ హీరోగా నటించిన "అతడు" చిత్రం కథే. ఈ కథ పవన్ కు వద్దనుకోవడంతో త్రివిక్రమ్ మహేష్ ను కలిసి ఈ "అతడు" కథ చెప్పాడంట. దాంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సినిమా విడుదలై సూపర్ హిట్టవడం జరిగిపోయింది.