English | Telugu

మహేష్ ఆగడు ప్రారంభం

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8:09ల సమయంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోలో జరిగాయి. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూర్తి కమర్షియల్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.