English | Telugu

డిసెంబర్ లో బసంతి వస్తున్నాడు

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా "బసంతి" అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. "బాణం" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న చైతన్య దంతులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ అందించిన ఈ చిత్ర ఆడియోను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.