English | Telugu

కోబలితో జతకట్టిన త్రివిక్రమ్

"అత్తారింటికి దారేది" వంటి ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రం తర్వాత మళ్ళీ పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో "కోబలి" అనే చిత్రం రానుంది. అయితే ఈ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి నిర్మించనున్నారు. మరి ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా లేక మరే ఇతర దర్శకుడైన తెరకేక్కిస్తాడా అనే సంగతి త్వరలోనే తెలియనున్నాయి. కానీ ఈ చిత్ర విశేషాల గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ....“కోబలి అనేది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే పదం. అమ్మవారికి బలి ఇవ్వడాన్ని కోబలి అంటారు. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచం కష్టంతో కూడిన కథ ఇది. అంటే రిస్క్ వుంది. అందుకే ఆ రిస్కేదో మేమిద్దరమే చేయాలనుకున్నాం. వీలైనంత త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం” అని చెప్పారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.