English | Telugu
కొంతమంది మన మధ్యలో లేకపోవడమే మంచిది.. !
Updated : Sep 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -208 లో......సీతాకాంత్ నిద్ర లేవగానే రామలక్ష్మి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. నాకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉందని సీతాకాంత్ అంటాడు.నేను సిరి గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ కి బాస్ అయితే నువ్వు నాకు బాస్ నువ్వు కూర్చోమంటే కూర్చొని ఉంటాను నిల్చోమంటే నిల్చుంటానని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అలా అని ఒకేసారి రెండు చెయ్ అనకు నాకు కష్టం అని సీతాకాంత్ సరదాగా అంటాడు. రామలక్ష్మి కుడా నవ్వుకుంటుంది. వాళ్లు సరదాగా ఉండడం మాణిక్యం, సుజాతలు చూస్తుంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.
వాళ్లు ఇద్దరు వచ్చి రామలక్ష్మి సీతాకాంత్ లతో సరదాగా మాట్లాడుతుంటే.. దూరం నుండి సందీప్, శ్రీలతలు చూసి కుళ్ళుకుంటారు. వాళ్లు కూడా సీతాకాంత్ దగ్గరికి వస్తారు. శ్రీలత నటిస్తూ.. నీకు ఏదైనా అవుతుందేమోనని భయంతో కొడలిని తిట్టానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఇలా జరగడానికి కారణమైన వాళ్ళని నువ్వు వదిలి పెట్టినా నేను వదిలి పెట్టను అల్లుడు అని శ్రీలత వైపు మాణిక్యం అంటాడు. దాంతో శ్రీలత టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత శ్రీలత సందీప్ ల దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. ఇదంతా మీరే చేసారని డౌట్ గా ఉందనగానే వాళ్లు ఇంకా టెన్షన్ పడుతారు. ఇద్దరికి రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది.
మరొకవైపు ఆఫీస్ నుండి మేనేజర్ హాస్పిటల్ కి వచ్చి మరి సీతాకాంత్ తో సంతకం పెట్టించుకుంటే అప్పుడే రామలక్ష్మి వచ్చి మేనేజర్ ని తిడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఆఫీస్ వ్యవహారం అవసరమా అని అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి సీతాకాంత్ కి పర్లేదని చెప్తాడు. సీతాకాంత్ ని చూడడానికి నందిని వస్తుంది. నందినికి చెప్పి రామలక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వచ్చావంటు నందినిని సీతాకాంత్ తిడతాడు. నందిని గుడికి వెళ్లి బొట్టు తెచ్చానని పెట్టబోతుంటే.. వద్దని సీతాకాంత్ నందినిపై కోప్పడతాడు. ఇంకోసారి రావద్దని చెప్తాడు. నీ శత్రువుని కాదని నందిని కోపంగా వెళ్తుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. నందిని మేడమ్ వెళ్ళారా అంటుంది. వెళ్ళింది కొంతమంది మన మధ్యలో లేకపోవడం మంచిదని సీతాకాంత్ అంటాడు. ఇంటికి వెళ్ళాడానికి ఏర్పాట్లు తాతయ్యని చేయమంటానంటూ రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.