English | Telugu

Eto Vellipoindi Manasu : భార్యకి తన ప్రేమ సంగతి చెప్పిన భర్త.. అదిరిపోయే ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -207 లో.....సీతాకాంత్ ని చూసి రామలక్ష్మి బాధపడుతుంది. ఈ డాక్టర్ వచ్చి ఏదో ఒకటి చెప్తే మన ప్రయత్నాలు మనం చేసుకుంటాం కదా అని శ్రీవల్లి, సందీప్ లు అనుకుంటారు. మీరు సైలెంట్ గా ఉండండి లేదంటే మనపై డౌట్ వస్తుందని శ్రీలత అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి సీతాకాంత్ విషయంలో మిరాకిల్ జరిగింది. అతను క్షేమంగా ఉన్నారని చెప్పగానే రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ ని రామలక్ష్మి ఆ సిచువేషన్ లో చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. సీతాకాంత్ స్పృహలోకి రాగానే రామలక్ష్మి డాక్టర్ ని వెళ్లి తీసుకొని వస్తుంది. డాక్టర్ మందులు రాసి ఇస్తాడు. సీతాకాంత్ ని చూస్తూ తనపై పడుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి టాబ్లెట్ ఇస్తుంది. మరొకవైపు శ్రీలత రౌడీ ని కొడుతుంది. ప్లాన్ ఫెయిల్ చేసావని కోప్పడుతుంది.

రామలక్ష్మి సీతాకాంత్ పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటుంది. మీరు ఆ సిచువేషన్ లో ఉన్నారని జాలితో నా ప్రేమ విషయం చెప్పలేదు.. నిజంగానే మీరంటే ఇష్టం.. ఇన్ని రోజులు చెప్దామనుకున్నాను కానీ చెప్పలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని రామలక్ష్మి అంటుంది. మీరు కూడా నన్ను ప్రేమిస్తునట్లు నాకు తెలుసు కానీ ఎందుకు చెప్పలేదని రామలక్ష్మి అడుగుతుంది. చెప్దాం అనుకున్న కానీ వీలు కాలేదు యాగం అయ్యాక చెపుదామనుకున్న ఇలా జరిగిందని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు ఒకరి ప్రేమ గురించి ఒకరు చెప్పుకున్నట్లు నందిని ఉహించుకుంటుంది. నందిని ఉహించుకొని అలా జరగకూడదంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో హారిక వచ్చి సీతాకాంత్ గురించేనా అని అడుగుతుంది. అవును రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకటి అవ్వద్దని అంటుంది.

మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ లేచి కూర్చొని ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు ఎందుకు లేచారని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...