English | Telugu

అభయ్ ఎలిమినేషన్...బిగ్‌బాస్‌ 8 నుండి రెడ్‌ కార్డుతో ఔట్‌

బిగ్ బాస్ సీజన్-8 మొదలై అప్పుడే మూడు వారాలు గడిచిపోయింది. మొదటి వారం బెజవాడ బేబక్క , రెండవ వారం శేఖర్ బాషా ఎలిమినేషన్ అయి బయటకు రాగా మూడవ వారం అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు.

ఇక హౌస్ లో శనివారం నాడు అభయ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వల్సిందే అని చెప్పాడు. ఇక నిన్నటి(సండే) ఎపిసోడ్ లో సండే ఫన్ డే అంటు ఆటలు, పాటలతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు నాగార్జున. హౌస్ మేట్స్ తో సినిమా పాటలేంటో గెస్ చేయమని చెప్తూ, మరోవైపు అదే పాటకి కంటెస్టెంట్స్ చేత డ్యాన్స్‌ చేపించాడు. ఇక హౌస్ లో మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉంటే వారిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేయగా.. చివరికి పృథ్వీ, అభయ్ నవీన్ నామినేషన్ లో ఉన్నారు. ఇక వారిద్దరిని యాక్షన్ రూమ్ కి పిలిపించాడు నాగార్జున. ఎప్పటిలాగే సస్పెన్స్ ఉంచి చివరగా అభయ్ నవీన్ ఎలిమినేషన్ అంటు నాగార్జున అన్నాడు. ఇక పృథ్వీ హౌస్ లోకి , అభయ్ నవీన్ స్టేజ్ మీదకి వచ్చేశాడు.

స్టేజ్ మీదకి వచ్చాక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే నీ ఎలిమినేషన్ జరిగిందని అభయ్ తో నాగార్జున చెప్పాడు. ‌ఇక తన జర్నీ వీడియో చూసి అభయ్ ఎమోషనల్ అయ్యాడు. డాడీ కావాలా సక్సెస్ కావాలా అని ఎవరైనా నన్ను అడిగితే మా డాడీ కావాలనే చెప్తా అంటు అభయ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక హౌస్ లో బ్లాక్ రోజెస్ ఎవరికిస్తావ్, రెడ్ రోజెస్ ఎవరికిస్తావో చెప్పమని నాగార్జున అడుగగా.. తన ఏవూ చూసుకొని ఎమోషనల్ అయ్యాడు. డాడీ కావాలా సక్సెస్ కావాలా అంటే.. డాడీ కావాలనే అంటానని అభయ్ చెప్పుకొచ్చాడు. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీలకి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. డోంట్ టేకిట్ ఇన్ నెగెటివ్ వే అని పృథ్వీతో అభయ్ అన్నాడు. నెక్ట్స్ ఇయర్ రాఖీ కట్టించుకోడానికి వస్తానని కిర్రాక్ సీతతో అభయ్ అన్నాడు‌. ఆ తర్వాత రెడ్ రోజ్ ని నిఖిల్, సీత, నబీల్ అండ్ సోనియాకి ఇచ్చాడు. వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ హౌస్ మేట్ అంటు సోనియా గురించి చెప్పాడు అభయ్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...