English | Telugu

remuneration of Abhay Naveen: అభయ్ నవీన్ రెమ్యునరేషన్ ఎంతంటే!


బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ ఊహించినంటే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి శనివారం ఎపిసోడ్‌లోనే అభయ్‌కి రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ ఔట్ అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. అసలు బిగ్‌‍బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలా రెడ్ కార్డ్ ఎవరికీ ఇవ్వలేదు. అయినా సరే మిగిలిన కంటెస్టెంట్ల రిక్వెస్ట్ కారణంగా అభయ్‌ని క్షమించారు నాగ్. కానీ ఈ వారం తక్కువ ఓటింగ్ కారణంగా నామినేషన్లలో ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు.

తొలిసారి నామినేషన్లలోకి వచ్చిన అభయ్ .. గత సీజన్ లో ఆట సందీప్ ఎలిమినేషన్ అయినట్టుగా ఎలిమినేషన్ అయ్యాడు. ఇక నామినేషన్‌లోకి వచ్చినప్పుడు గేమ్ బాగా ఆడాలి. సెకెండ్ వీక్ వరకు బాగా ఆడిన అభయ్... థర్డ్ వీక్ ఏం ఆడలేదు. పద్మావతి 2.0 టాస్కులో ఖాళీగా కూర్చున్నాడు. పైగా వాళ్ల టీమ్ మెట్స్ గుడ్ల కోసం కొట్లాడుతుంటే వద్దంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చాడు. దీంతో పాటు బిగ్‌బాస్‌పై బూతుల దండకం కూడా అందుకున్నాడు. దీంతో ఓటింగ్‌లో చివరిలో మిగిలిపోయి.. తన ఎలిమినేషన్‌కి తనే గొయ్యి తవ్వుకున్నాడు అభయ్.

అభయ్ నవీన్ బిగ్‌బాస్ హౌస్‌లో మూడు వారాలు ఉన్నాడు.‌ ఇక అభయ్‌కి ఒక్కరోజుకి రెమ్యూనరేషన్ 28 వేల రూపాయలంట. అంటే వారానికి దాదాపు రూ 2 లక్షలు. మొత్తం మూడు వారాలకి గాను మొత్తంగా అభయ్ రూ.6 లక్షలు సంపాదించాడన్నమాట. అయితే రెమ్యూనరేషన్ వివరాలు అధికారికంగా ఎవరు చెప్పరు. అభయ్ కి ఇంత రెమ్యునరేషన్ ఉండొచ్చనే వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...